ఈ కాలం బాహుబలి మోడీయేనట

ఈ కాలం బాహుబలి మోడీయేనట

బాహుబలి.. బాహుబలి.. బాహుబలి.. ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఎవరి నోట విన్నా ఇదే మాట. సినిమా వాళ్లు... ప్రేక్షకులే కాదు రాజకీయ నేతలూ బాహుబలి గురించే మాట్లాడుతున్నారు. తాజాగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడైతే బాహుబలికి, రాజకీయాలకు ముడిపెట్టేశారు.  బాహుబలి సినిమాకు ఆయన సెకండ్ ప్లేస్ ఇచ్చారు.. మరి ఆయన ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇచ్చారో తెలుసా? ఇంకెవరికి... ప్రధాని మోడీకి. ఆయనే నిజమైన బాహుబలి అని వెంకయ్య చెప్పుకొచ్చారరు.

మనకు తెలిసిన బాహుబలి ఒకరే.. అది భారత ప్రధాన మంత్రి మోడీ... రెండో బాహుబలి సినిమా 'బాహుబలి' అని ఆయన అన్నారు. అంతకాదు.. బాహుబలి అంటే బహుముఖమైనటువంటి బలం, ప్రజ్ఞావిశేషాలు, ఆలోచనలతో భారత దేశాన్ని బహుముఖంగా వికసింపజేయడమని... మోడీ ఆ పని చేస్తున్నారని వెంకయ్య అన్నారు.
   
పొలిటికల్ బాహుబలి మోడీ ప్రయత్నాన్ని ప్రజలు హర్షిస్తున్నారు.. ఆయన వెంట నడుస్తున్నారు అని మోడీపై వెంకయ్య ఎప్పటిలాగే ప్రశంసలు కురిపించారు. ఇంకెందుకాలస్యం మోడీకి కూడా సాహో అనాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు