పాకిస్తాన్ తో యుద్ధానికి అన్నీ సిద్ధం !

పాకిస్తాన్ తో యుద్ధానికి అన్నీ సిద్ధం !

యుద్ధ మేఘాలు క‌మ్ముకుంటున్నాయా? అన్న సందేహాం వ్య‌క్త‌మ‌య్యే ప‌రిణామం ఒక‌టి చోటు చేసుకుంద‌న్న విష‌యం కాస్త ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. క‌య్యానికి కాలు దువ్వేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండ‌ని భార‌త్‌.. తాజాగా జ‌రుగుతున్న ప్ర‌య‌త్నాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఎందుకు ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకున్నార‌న్న విష‌యంపై ఎవ‌రికీ స‌రైన అవ‌గాహ‌న లేన‌ప్ప‌టికీ.. ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ త‌న సిబ్బందికి ఇచ్చిన కొత్త ఆదేశాలు ఇప్పుడు కొత్త చ‌ర్చ‌కు తెర తీస్తున్నాయి.

కాస్త ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ వ్య‌వ‌హారంలోకి వెళితే.. గ‌త వారం ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ క‌మాండ‌ర్ల స‌ద‌స్సు న్యూఢిల్లీలో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఎయిర్ ఫోర్స్ చీఫ్ బీఎస్ థ‌నోవా త‌న క‌మాండ‌ర్ల‌తో మాట్లాడుతూ.. ఒక‌వేళ పాక్ తో ప‌ది రోజుల యుద్ధం.. చైనాతో ప‌దిహేను రోజుల యుద్ధం వ‌స్తే.. అందుకు త‌గిన ఏర్పాట్లు చేసుకోవాల‌ని.. అందుకు సిద్ధంగా ఉండాల‌న్న‌ది ఎయిర్ ఫోర్స్ చీఫ్ మాట‌లుగా చెబుతున్నారు.

ఇందుకు త‌గ్గ‌ట్లుగా చురుకైన స‌న్న‌ద్ధ‌త‌తో పాటు.. మ‌రింత సామ‌ర్థ్యాన్ని పెంచుకోవాల‌న్న సూచ‌న చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఉన్న‌ట్లుండి ఎందుకీ మార్పు అన్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది. ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని.. యుద్ధ విమానాల్ని పూర్తిస్థాయిలో ఆయుధాలు.. క్షిప‌ణులు.. అల‌ర్ట్ రాడ‌ర్ వ్య‌వ‌స్థ‌తో స‌ర్వ‌స‌న్న‌ద్ధంగా ఉండాల‌న్న సూచ‌న‌ను చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఇంత‌కీ.. ఎందుకీ అలెర్ట్ నెస్‌? ఏ దిశ‌కు ఈ అడుగులు అన్న‌వి ఇప్పుడు ప్ర‌శ్న‌లుగా మారాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు