ఫేస్ బుక్, గూగుల్ ను బ్యాన్ చేయమంటున్నాడు

ఫేస్ బుక్, గూగుల్ ను బ్యాన్ చేయమంటున్నాడు

అమెరికా హెచ్-1బీ వీసాలపై ఆంక్షలను విధించడంపై ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ఘాటుగా స్పందించారు. అమెరికా చర్యలకు ప్రతిగా భారత్ కూడా అదే రీతిలో రియాక్ట్ అవ్వాల‌ని ఆయ‌న సూచించారు. ఇందుకోసం సోష‌ల్ మీడియాలో అమెరికాకు చెందిన పాపుల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌లైన  ఫేస్‌బుక్, గూగుల్, వాట్సప్‌లను నిషేధించాలని అభిప్రాయపడ్డారు.

అప్పుడే అమెరికాకు భార‌త్ స‌త్తా తెలుస్తుంద‌ని వ్యాఖ్యానించారు. భారత్‌లో ఇలాంటి సెర్చ్ ఇంజన్లు, యాప్‌లు చాలా ఉన్నాయని, అలాంటప్పుడు అమెరికాకు చెందిన వాటిని ఎందుకు ఉపయోగించాలని మిట్ట‌ల్ సూటిగా ప్రశ్నించారు.

మీడియాతో మాట్లాడిన సునీల్ మిట్ట‌ల్ భారతీయుల రాకపై అమెరికా ఆంక్షలు విధించడం సరికాదని పేర్కొన్నారు. మ‌న సేవ‌ల‌తో అమెరికా సంస్థ‌లు పెద్ద ఎత్తున లాభాలు అర్జిస్తున్నాయ‌ని తెలిపారు. భార‌తీయుల నిబ‌ద్ద‌త‌, క‌ష్టం చేసే త‌త్వం, సృజ‌నాత్మ‌క‌తను వేనేళ్ల పొగిడి ఇపుడు ఆలోచ‌న‌లను మార్చుకోవ‌డం ఏమిట‌ని ఎయిర్ టెల్ అధినేత‌ ప్ర‌శ్నించారు.

విదేశాలకు చెందిన సంస్థలు భారత్‌లో వ్యాపారం చేస్తూ భారీగా ఆర్జిస్తున్నాయని, ఈ విషయాన్ని ఆయా దేశాలు గుర్తించాలని తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు