సుప్రీం జ‌డ్జీల‌కు చుక్క‌లు చూపిస్తున్నాడు

సుప్రీం జ‌డ్జీల‌కు చుక్క‌లు చూపిస్తున్నాడు

హైకోర్టు న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు చేసిన కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్.. ఇంకా సుప్రీంకోర్టుతో ఘర్షణాత్మక వైఖరినే కొనసాగిస్తున్నారు. తనపై కోర్టు ధిక్కారం కింద అభియోగాలు మోపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖెహర్ సహా ఏడుగురు న్యాయమూర్తుల విదేశీ ప్రయాణాలపై మరోసారి నిషేధాజ్ఞలు జారీచేశారు.

వచ్చేనెల ఒకటో తేదీ నుంచి తన కేసు విచారణ పూర్తయ్యే వరకు సుప్రీం న్యాయమూర్తులను విదేశీ యానానికి అనుమతించవద్దని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)ను శుక్రవారం ఆదేశించారు.

దళితుడిగా తన హక్కులను కాలరాస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జాతీయ స్థాయి నేరస్థులని జస్టిస్ కర్ణన్ ఆరోపిస్తూ సీజేఐ తదితరుల విదేశీ యానంపై ఈ నెల 13న తొలిసారి నిషేధాజ్ఞలు జారీచేసిన సంగతి తెలిసిందే.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విదేశాలకు వెళ్లి కుల వివక్ష వైరస్ వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తారని కర్ణన్ ఆరోపించారు. కాగా, క‌ర్ణ‌న్ నిర్ణ‌యాలు ఆస‌క్తికరంగా మారాయి. సుప్రీం కోర్టు జ‌డ్జీల విష‌యంలో క‌ర్ణ‌న్ త‌న దూకుడు వ్య‌వ‌హార‌శైలితో ముందుకు సాగ‌డం న్యాయవ్య‌వ‌స్థ‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు