కేసీఆర్ స్పీచ్ వెనుక ఎన్నిక‌ల స్కెచ్‌?!

కేసీఆర్ స్పీచ్ వెనుక ఎన్నిక‌ల స్కెచ్‌?!

గులాబీ ద‌ళ‌ప‌తి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్ర‌గ‌తి నివేదిన స‌భ పేరుతో వ‌రంగ‌ల్‌లో నిర్వ‌హించిన స‌భ వెనుక లెక్క‌లు వేరే ఉన్నాయా? వరంగల్‌ సభను 2019లో జరగబోయే ఎన్నికలకు వేదికగా చేసుకున్నారా? ఒక‌వేళ ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తే అందుకు శ్రేణులు సిద్ధ‌మ‌య్యేందుకు ఈ స‌భ‌ను ఊతంగా భావించారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. వ‌రంగ‌ల్ స‌భ‌లో కేసీఆర్ ఆయన ప్రసంగం సాగిన రీతిని విశ్లేసిస్తే  ఇదే అభిప్రాయం క‌లుగుతోంది.

పార్టీ నేత‌లు 75 లక్షల సభ్యత్వం, ప్రభుత్వ పథకాలు కంటే మళ్లీ సెంటిమెంట్‌పైనే కేసీఆర్‌ నమ్ముకున్నారు. ఆంధ్రావారి వల్లే తెలంగాణకు నష్టం జరిగిందని, వారు పోతేనే తెలంగాణ బాగుపడుతుందని 2014 ఎన్నికల ప్రచార సభల్లో సెంటిమెంట్‌ను ప్రయోగించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌పార్టీలో గ్రూపులు, టీడీపీకి ఆంధ్రాపార్టీగా ముద్రపడడంతో అప్పటి ఎన్నికలు టీఆర్‌ఎస్‌కు కలిసొచ్చాయి.

ఇప్పుడు మళ్లీ 2019 ఎన్నికల కోసం ముందస్తు ప్రిపరేషన్‌లో సెంటిమెంట్‌ను వాడుకోవడం గమనార్హం. కోటి ఎకరాలకు నీరు ఇద్దామనుకుంటే కోర్టు కేసులతో అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, అటువంటి వారికి బుద్ధి చెప్పాలని అనడం అందులో భాగమేనని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి తిరుగులేదని, ఇందుకు 75 లక్షల సభ్యత్వమే నిదర్శన‌మని చెప్పారు.

మళ్లీ టీఆర్‌ఎస్‌నే గెలుస్తుందని ముందస్తు శంఖారావం ఊదారు. కమ్యూనిస్టులకు బలం లేదని, కాంగ్రెస్ పార్టీనే పోటీగా తమకు ఉంటుందని అన్నారు. బీజేపీకి అంత సీన్‌ లేదని, టీడీపీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు