భ‌జ్జీ ట్వీటాడు.. పైలెట్‌ ఉద్యోగం ఊడింది

భ‌జ్జీ ట్వీటాడు.. పైలెట్‌ ఉద్యోగం ఊడింది

గ‌తంలో లాంటి ప‌రిస్థితులు లేవు. ఇప్పుడేదైనా ఓపెనే. త‌మ‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌లిగినా.. సోష‌ల్ మీడియాలో త‌మ అభిప్రాయం పంచుకోవ‌టం ఇప్పుడో అల‌వాటుగా మారింది. ప్ర‌జ‌ల అభిప్రాయాల‌కు విలువ‌నిచ్చే విధంగా కొన్ని సంస్థ‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. నేరుగా ఫిర్యాదు చేయ‌కున్నా.. సోష‌ల్ మీడియాలో చేసే పోస్టుల‌పై విచార‌ణ జ‌రిపించి.. ఎత్తి చూపిన త‌ప్పులు నిజ‌మ‌ని తేలితే.. స‌రిదిద్దుకోవ‌టానికి కంపెనీలు ముందుకు వ‌స్తున్నాయి. ఇందుకునిద‌ర్వ‌నంగా జెట్ ఎయిర్ వేస్ఉదంతాన్ని చెప్పొచ్చు.

త‌న ప్ర‌యాణ స‌మ‌యంలో ఒక మ‌హిళ‌కు.. ఒక దివ్యాంగుడి విష‌యంలో ఎయిర్ లైన్స్ సిబ్బంది వ్య‌వ‌హ‌రించిన అనుచిత వైఖ‌రిని గుర్తించిన టీమిండియా స‌భ్యుడు హ‌ర్భ‌జ‌న్ సింగ్ ట్విట్ట‌ర్ ద్వారా ట్వీట్ చేశారు. ఒక మ‌హిళ‌.. శారీర‌క వైకల్యం క‌లిగిన వ్య‌క్తి విష‌యంలో జెట్ ఎయిర్ వేస్ పైలెట్ ఒక‌రు దురుసుగా వ్య‌వ‌హ‌రించ‌టమే కాదు.. వారిని జాతివివ‌క్ష‌తో వ్యాఖ్య‌లు చేశార‌ని.. వారు తీరు నిబంధ‌న‌ల్ని ఉల్లంఘించిన‌ట్లుగా ఉందంటూ భ‌జ్జీ ఫిర్యాదు ట్వీట్ చేశారు.

దీనిపై స్పందించిన జెట్ ఎయిర్ వేస్‌.. ఈ ఉదంతంపై విచార‌ణ‌ను నిర్వ‌హించారు. భ‌జ్జీ చేసిన ఆరోప‌ణ‌ల్లో నిజ‌ముంద‌ని గుర్తించిన ఎయిర్ వేస్ వెంట‌నే.. పైలెట్ పై చ‌ర్య‌ల‌కు ఉప క్ర‌మించారు. నిబంధ‌న‌ల్ని ఉల్లంఘించిన ఉదంతంలో స‌ద‌రు పైలెట్ బెర్నాండో హోయిస్లిన్ ను విధుల నుంచి త‌ప్పించిన‌ట్లుగా జెట్ పేర్కొంది.

త‌న దారిన తాను పోకుండా.. త‌న చుట్టూ ఉన్న వారికి జ‌రిగిన అన్యాయంపై భ‌జ్జీ స్పందించిన తీరు.. దీనికి ప్ర‌తిస్పంద‌న‌గా జెట్ ఎయిర్ వేస్ తీసుకున్న చ‌ర్య‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ప్ర‌యాణికుల్ని ఇబ్బంది పెట్టే ఉదంతాల్ని తాము సీరియ‌స్ గా ప‌రిగ‌ణిస్తామ‌ని.. చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని జెట్ ఎయిర్ వేస్ స్ప‌ష్టం చేస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు