క‌ట్రీనాకు ఫేవ‌రెట్ క్రికెట‌ర్ ఎవ‌రో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు

క‌ట్రీనాకు ఫేవ‌రెట్ క్రికెట‌ర్ ఎవ‌రో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు

కోట్లాది మంది హృద‌యాల్లో గూడు క‌ట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ క‌ట్రీనాకు సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌య‌మిది. మిగిలిన వారికి భిన్నంగా త‌న చాయిస్ ఉంటుంద‌న్న విష‌యాన్ని త‌న తీరుతోఎప్ప‌టిక‌ప్పుడు చాటు క‌ట్రీనా.. తాజాగా త‌న ఫేవ‌రెట్ క్రికెట‌ర్ ఎవ‌రో చెప్పుకొచ్చింది. క్రికెట్‌ను అమితంగా ఇష్ట‌ప‌డే సెల‌బ్రీటీల్లో క‌ట్రినా ఒక‌రు. మిగిలిన క్రికెట్ అభిమానుల మాదిరే ఐపీఎల్‌ను అమితంగా ఇష్ట‌ప‌డే క‌ట్రీనా తాజా ఆస‌క్తిక‌ర విష‌యాన్ని వెల్ల‌డించింది.

సాధార‌ణంగా టీమిండియా ఆట‌గాళ్ల‌లో ఎవ‌రంటే ఇష్ట‌మ‌ని అడిగినంత‌నే స‌చిన్ పేరో.. ధోనీ పేరునో లేదంటే కోహ్లీ పేరునో చెప్ప‌టం మామూలే. కానీ.. క‌ట్రీనా మాత్రం అందుకు భిన్నం. త‌న‌కు ఒక‌ప్ప‌టి టీమిండియా వాల్‌.. మిస్ట‌ర్ డిపెండ‌బుల్ రాహుల్ ద్రావిడ్ అంటే ఇష్ట‌మ‌ని చెబుతోంది. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు టీంకు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న క‌ట్రీనాకు.. ద్ర‌విడ్ అంటే ఎందుకంత ఇష్ట‌మ‌ని అడిగితే.. అత‌డో నిజ‌మైన జెంటిమెన్ గా అభివ‌ర్ణించింది.

నిరాశ‌.. కోపానికి గురి కావ‌టం తాను చూడ‌లేద‌ని.. అత‌నెంతో సిగ్గ‌రిగా ఆమె చెప్పుకొచ్చారు. రెండు.. మూడు మాట‌ల కంటే ఎక్కువ‌గా మాట్లాడ‌ర‌ని చెప్పిన క‌ట్రీనా మాట‌ల్ని వింటే.. ద్ర‌విడ్ ను ఇష్ట‌ప‌డ‌ట‌మే కాదు.. అత‌గాడికి సంబంధించిన చాలా వివ‌రాలు ఆమెద‌గ్గ‌ర ఉన్నాయ‌నిపించ‌క మాన‌దు. ఫ్యాన్ ద‌గ్గ‌ర ఆ మాత్రం ఇన్ఫ‌ర్మేష‌న్ ఉండ‌కుండా ఉంటుందా మ‌రి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు