ఓయూకు ప‌వ‌న్ తెలిపిన శుభాకాంక్ష‌లు చూశారా?

ఓయూకు ప‌వ‌న్ తెలిపిన శుభాకాంక్ష‌లు చూశారా?

మిగ‌తా రాజ‌కీయ నేత‌ల కంటే తాను ఎంత భిన్న‌మైన వ్య‌క్తినో మ‌రోమారు జ‌న‌సేన పార్టీ అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చాటుకున్నారు. ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న‌లో భాగంగా తెలంగాణ‌లో ఉద్య‌మాల పురిటి గ‌డ్డగా నిలిచిన ఉస్మానియా యూనివ‌ర్సిటీ త‌న వందేళ్ల‌ సంబురాలు జ‌రుపుకొంటున్న నేప‌థ్యంలో ప‌వ‌న్ శుభాకాంక్ష‌లు తెలిపారు.

అయితే అది ఆషామాషీగా పత్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం కాకుండా త‌న గుండె లోతుల్లో నుంచి భావాల‌ను విశ్లేషిస్తూ ఉస్మానియా యూనివర్సిటీకి వందనం పేరుతో ప్ర‌త్యేక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.


ప‌వ‌న్ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న ఇలా ఉంది. 'తమసోమా జ్యోతిర్గమయ అనే దివ్య సూక్తిని తన నుదుటన ధరించి, లక్షలాది మందికి జ్ఞాన వెలుగులను పంచిపెడుతున్న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రణామాలు అర్పిస్తున్నాను. బ్రిటిష్ విద్యావేత్త విల్చెడ్ సుయిన్ బ్లంట్ ఆలోచనల్లో ఊపిరిపోసుకుని, ఏడో నిజాం నవాబ్ ఉస్మాన్ మీర్ అలీఖాన్ చేతుల మీదుగా రూపుదిద్దుకున్న ఈ తల్లి నీడలో చదువుకున్న ఎందరో విద్యార్థులు మేధావులు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, డాక్టర్లు, కళాకారులుగా దేశానికి సేవలు అందిస్తూనే ఉన్నారు. తెలుగు ముద్దుబిడ్డ,ఈ దేశ ప్రధానమంత్రి పీఠం అధిష్టించిన పి.వి.నరసింహారావు ఈ తల్లి ఒడిలో పెరిగినవాడే. ముఖ్యమంత్రులు, మంత్రులను తీర్చిదిద్దిన ఈ చదువుల మాత శత వసంతాల పండుగను రేపటి నుంచి జరుపుకుంటున్న శుభ సందర్భంగా నా తరపున, జనసేన శ్రేణుల తరుపున శుభాకాంక్షలు. జైహింద్" అంటూ శుభాకాంక్షల్లోనూ ప‌వ‌న్ త‌న ప్ర‌త్యేకత‌ను చాటుకున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు