ఛత్తీస్ గఢ్ సీఎంకు మావోయిస్టులతో సంబంధాలు?

ఛత్తీస్ గఢ్ సీఎంకు మావోయిస్టులతో సంబంధాలు?

కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో రమణ్ సింగ్ గెలిచేందుకు మావోలు సహకరించారంటూ తీవ్ర స్థాయి ఆరోపణలు గుప్పించారు.

మావోయిస్టుల విషయంలో బీజేపీ రాజీ పడిందని దిగ్విజయ్ విమర్శించారు. ఛత్తీస్ గఢ్ లోని సుకుమా జిల్లాలో ఆకస్మిక దాడి జరిపిన మావోయిస్టులు 26 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దిగ్విజయ్ మాట్లాడుతూ, జవాన్ల మృత దేహాలతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.

అయితే... ఛత్తీస్ గఢ్ రాజకీయ వర్గాల్లో ఇలాంటి అనుమానం చాలాకాలంగా ఉంది. 2013లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత మహేంద్ర కర్మ సహా 25 మంది కాంగ్రెస్ నేతలను మావోయిస్టులను హతమార్చినప్పుడే ఇలాంటి ఆరోపణలు వచ్చాయి.

మహేంద్ర కర్మ సల్వాజుడం పేరుతో మావోయిస్టు వ్యతిరేక బలగాలను నడిపిన నేపథ్యంలో ఆయన పట్ల మావోయిస్టులు గుర్రుగా ఉండేవారు.  ఆ రీజన్ తోనే రమణ్ సింగ్ కు, మావోయిస్టులకు మధ్య రహస్య అవగాహన ఉందన్న ఆరోపణలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు