ఇది.. టీడీపీ ఎంపీ పుత్ర‌ర‌త్నం వీరంగం

ఇది.. టీడీపీ ఎంపీ పుత్ర‌ర‌త్నం వీరంగం

అధికారం చేతిలో ఉంటే ఆ తీరే వేరు ఉంటుంది. అధికారాన్ని బాధ్య‌త‌గా ఫీల‌య్యే నేత‌లు.. నేత‌ల కుటుంబాలు చాలా చాలా త‌క్కువ‌నే చెప్పాలి. ప్ర‌జ‌లు త‌మ మీద పెట్టుకున్న అభిమానాన్ని త‌ప్పుగా అర్థం చేసుకొని.. అపార్థం చేసుకునేవారే ఎక్కువ‌గా క‌నిపిస్తుంటారు. అధికారంలో ఉన్న‌ప్పుడు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించి ప్ర‌జ‌ల అభిమానాన్ని చేజేతులారా చెడ‌గొట్టుకునే నేత‌ల‌కు తెలుగు రాజ‌కీయాల్లో కొద‌వ లేద‌ని చెప్పాలి. స‌మ‌కాలీన భార‌తంలో.. అధికారాన్నిత‌మ సొంత ఆస్తిగా ఫీల‌య్యే నేత‌ల‌కు ఆద‌రాభిమానాలు అంత‌కంత‌కూ త‌గ్గుతున్నాయి. కానీ.. అలాంటివేమీ ప‌ట్టించుకోని వైనం చాలామంది నేత‌ల్లో క‌నిపిస్తుంటుంది.

తాజాగా.. అలాంటి తీరునే ప్ర‌ద‌ర్శించారు ఏపీ అధికార‌ప‌క్ష ఎంపీ కుమారుడు. అనంత‌పురంజిల్లా హిందూపురం ఎంపీ నిమ్మ‌ల కిష్ట‌ప్ప కుమారుడు శిరీశ్ తాజాగా వీరంగాన్ని సృష్టించారు. క‌ర్ణాట‌క‌లోని బాగేప‌ల్లి టోల్‌గేట్ వ‌ద్ద ఆయ‌న ర‌చ్చ ర‌చ్చ చేశారు. టోల్ ఫీజు క‌ట్టాల‌ని అడిగిన టోల్ గేట్ సిబ్బందిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన నిమ్మ‌ల కిష్ట‌ప్ప కుమారుడు.. అనంత‌రం అనుచ‌రుల‌ను పిలిపించి.. టోల్‌గేట్ సిబ్బందిపై దాడుల‌కు పాల్ప‌డ‌టం గ‌మ‌నార్హం.

ఈ ఘ‌ట‌న‌లో టోల్ గేట్ అద్దాలు.. కంప్యూట‌ర్‌.. ఫ‌ర్నీచ‌ర్ ధ్వంస‌మ‌య్యాయి. ఎంపీ కొడుకునైన త‌న‌ను టోల్ ఫీజు అడుగుతారా? అంటూ ఫైర్ అయిన కిష్ట‌ప్ప కుమారుడు.. త‌న అనుచ‌రుల‌తో ఆగ‌మాగం సృష్టించిన‌ట్లుగా చెబుతున్నారు. కిష్ట‌ప్ప కుమారుడి తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. మ‌రి.. అధికార‌ప‌క్ష ఎంపీ కొడుకు తీరుపై ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎలారియాక్ట్ అవుతారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు