నాలుగు ల‌క్షల‌ ఇండియ‌న్ల‌కు గ్రీన్ కార్డ్ టెన్ష‌న్‌

నాలుగు ల‌క్షల‌ ఇండియ‌న్ల‌కు గ్రీన్ కార్డ్ టెన్ష‌న్‌

అమెరికా నూతన అధ్య‌క్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత ఆ దేశంలో నివసిస్తున్న‌ భార‌తీయులకు కంటిమీద కునుకు లేని ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయని వార్త‌లు వెలువ‌డుతున్న సంగ‌తి తెలిసిందే. మొద‌ట హెచ్1బీ వీసాలపై ఆంక్షల నేపథ్యంలో అక్క‌డి మ‌న‌వాళ్ల‌కు చిక్కులు ఎదురైన సంగ‌తి తెలిసిందే. ఆ త‌దుప‌రి విద్వేష దాడుల వ‌ల్ల బిక్కుబిక్కుమ‌నే ప‌రిస్థితి ఎదురైంది. తాజాగా కొత్త ముప్పు వ‌చ్చిప‌డింది. అదే గ్రీన్ కార్డ్ అనుమ‌తులు.

అమెరికా దేశం శాశ్వత పౌరసత్వం కల్పించే గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది భారతీయుల భవితవ్యం అగమ్యగోచరంగా తయారైంది. అమెరికాలో నివసిస్తున్న ఎన్నారైల్లో సుమారు 15 లక్షల మంది హెచ్1బీ వీసా హోల్డర్లు గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్నారని అక్క‌డి వలసదారుల సంఘాలు చెప్తున్నాయి. వీరిలో అత్యధికులు భారతీయులే. ఎంత లేద‌న్నా వీరిలో ఓ 4 లక్ష‌ల మంది ఇండియ‌న్లు ఉంటార‌ని అంచ‌నా. వీరంతా దాదాపు పదేళ్ల‌ నుంచి గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్నవారే. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితి క్లిష్టంగా మార‌డం టెన్ష‌న్‌ను మ‌రింత పెంచేస్తోంద‌ని అంటున్నారు.

తాజా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్1బీ వీసాలపై భారీ ఆంక్షలు విధించింది. అత్యధిక వేతనాలు ఇచ్చే ఉద్యోగాల్లోనే హెచ్1బీ వీసాదారులను అనుమతించాలని నిర్ణయించింది. దీంతో ఇప్పుడు హెచ్1బీ వీసాలపై ఉన్నవారు ఎవరైనా ఉద్యోగం కోల్పోయిన పక్షంలో కొత్తగా ఉద్యోగం దొరకడం అసాధ్యమే. హెచ్1బీ-గ్రీన్‌కార్డుల వ్యవస్థ సాంకేతికంగా వేర్వేరు. కానీ.. ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుందని భారత్ నుంచి వచ్చిన వలసదారులు పేర్కొంటున్నారు. గ్రీన్‌కార్డు రానిపక్షంలో తమకు తిరిగి భారత్‌కు వెళ్లిపోవడం మినహా మరో మార్గం లేదని చెప్తున్నారు.

హెచ్1బీ వీసాలపై ఏళ్ల‌ తరబడి పనిచేస్తున్న తాము ఒప్పంద కార్మికుల్లా మారిపోయామని ఒక ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్న గౌరవ్ మెహతా అనే అమెరికాలోని మీడియాతో వాపోయారు. మెహతాకు అమెరికాలో పుట్టిన కొడుకు ఉన్నాడు. అయితే.. పరిస్థితుల ప్రభావంతో ఉన్న ఉద్యోగం పోతే కొత్తగా అధిక వేతనం చెల్లించే ఉద్యోగం దొరకడం అసాధ్యమని, ఇక తిరిగి భారత్‌కు వెళ్లిపోక తప్పదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఎన్నో ఉదంతాలు ఉన‌నాయి

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు