ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా జేఆర్ పుష్పరాజ్?

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా జేఆర్ పుష్పరాజ్?

తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్ష పదవిలో ఎవరిని నియమించాలనే విషయంలో చంద్రబాబు కొంత క్లారిటీకి వచ్చారని తెలుస్తోంది. ఆ పదవిని దళితులకు ఇవ్వాలని ఆయన డిసైడైనట్లుగా చెబుతున్నారు.  వచ్చే నెలలో జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడులో పార్టీ జాతీయ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంటారనే చర్చ పార్టీలో జరుగుతోంది.

ఏపి రాష్ట్ర శాఖకు దళితుడిని అధ్యక్షుడిగా నియమిస్తే ఎలా ఉంటుందన్న అభిప్రాయ సేకరణకు సన్నిహితుల వద్ద ఆయన తెరలేపినట్లు తెలిసింది. అప్పుడు మూడు శాఖలకు ఓసీ, బీసీ, ఎస్సీలు అధ్యక్షులుగా ఉండటం ద్వారా అన్ని కులాలకు ప్రధానంగా బడుగు, బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ ఒక్కటే సముచిత స్థానం ఇస్తుందన్న సంకేతాలు ప్రజల్లోకి పంపించే అవకాశాలుంటాయని భావిస్తున్నట్లు సమాచారం. జాతీయ అధ్యక్షుడిగా ఓసీ వర్గానికి చెందిన చంద్రబాబు.. తెలంగాణకు బీసీ నేత రమణ ఉండగా ఏపీలో దళిత నేతను ఎంచుకుంటున్నట్లు చెబుతున్నారు.
   
ప్రస్తుతం మంత్రిగా నియమితులైన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావు స్థానంలో కాపు వర్గానికి చెందిన హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పను నియమించాలన్న యోచన కూడా చేశారు. అయితే ఆయన మళ్లీ ఎన్నికలపై దృష్టి సారించాల్సి ఉండటం, దానికితోడు చినరాజప్ప కూడా అధ్యక్ష పదవిపై అంత ఆసక్తి కనబర్చలేదని తెలిసింది. ఈ క్రమంలోనే దళిత అభ్యర్థి ఆలోచన తెరపైకి వచ్చింది.  సీనియర్ అయిన మాజీ మంత్రి జెఆర్ పుష్పరాజ్ కు ఛాన్సిస్తారని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు