ములాయం బ్యాచ్ రేంజి తగ్గించిన యోగి

ములాయం బ్యాచ్ రేంజి తగ్గించిన యోగి

ఉత్తర ప్రదేశ్ లో దుమ్ము రేపుతున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ రోజుకో సంచలన నిర్ణయంతో హడలెత్తిస్తున్నారు. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థుల విషయంలోనూ నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ములాయం కుటుంబం రేంజి తగ్గించే నిర్ణయం తీసుకున్నారు. భద్రతా సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవసరానికిమించి భద్రత కల్పించుకోవడం ఇప్పుడు స్టేటస్ సింబల్ గా మారిపోయిన తరుణంలో ములాయం ఫ్యామిలీ సెక్యూరిటీని ఆయన తగ్గించారు. ములాయం కుటుంబంతో పాటు మాజీ సీఎం మాయావతి భద్రతనూ తగ్గించారు.

యూపీ మాజీ ముఖ్యమంత్రులు ములాయం, అఖిలేష్, మాయావతిలకు భద్రతను ఒక్కసారిగా తగ్గించారు.  ములాయం కుటుంబసభ్యులు డింపుల్ యాదవ్, శివపాల్ యాదవ్, రాంగోపాల్ యాదవ్ లకు కూడా భద్రతను తగ్గించారు. నిన్న రాత్రి హోంశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశం సందర్భంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో వారిని రెచ్చగొట్టేలా బీజేపీ సీనియర్ నేత వినయ్ కటియార్ తో పాటు మరికొందరికి భద్రతను పెంచారు. కటియార్ కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించారు.
   
ప్రస్తుతం యూపీలో 151 మంది వీఐపీలు భారీ భద్రత పొందుతున్నారు. వీరిలో 46 మందికి భద్రతను తగ్గించారు యోగి. మిగిలిన 105 మందికి పూర్తిగా భద్రతను తొలగించారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ, భద్రతను కలిగి ఉండటం సామాజిక హోదాగా భావిస్తున్నారని... వీరికి భద్రతను కల్పిస్తున్న సిబ్బందిని సామాన్యుల రక్షణ కోసం వినియోగించాలని అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు