అమెరిక‌న్ ఎయిర్‌లైన్స్‌లో మ‌రో దారుణం

అమెరిక‌న్ ఎయిర్‌లైన్స్‌లో మ‌రో దారుణం

అగ్ర‌రాజ్యం అమెరికాలో విమానయ సిబ్బంది రెచ్చిపోతున్నారు. ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌  విమానంలో ఓ వ్యక్తిని దారుణంగా విమానం నుంచే దించేయగా తాజాగా అలాంటి  ఘటనే అమెరికా ఎయిర్‌ లైన్స్ విమానంలో జరిగింది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో చోటు చేసుకుంది. ఓ పాపతో కలిసి విమానం ఎక్కిన మహిళ పట్ల సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించారు.

కారణమెంటో తెలియదు గానీ ఆ మహిళను ఆమెతో పాటు ఉన్న పాపను విమానం నుంచి దించేశారు. మహిళకు మద్దతుగా మాట్లాడిన వ్యక్తిపై కూడా చేయి చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ తతంగాన్ని మరో ప్రయాణికుడు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయటంతో విషయంవెలుగులోకి వచ్చింది.

అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఉద్యోగి విమానంలో ప్రయాణం చేస్తున్న ఒక మహిళతో ఘర్షణ పడి ఆమె వద్ద ఉన్న స్ట్రాలర్‌ను లాక్కున్నాడు. ఈ సందర్భంగా స్ట్రాలర్‌తో ఆమెను గట్టిగా కొట్టాడు. దీంతో అందులో ఉన్న పిల్లవాడు పడిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్‌లో సురయన్‌ అద్యనాథ్య అనే వ్యక్తి  పోస్ట్‌ చేశాడు. దీంతో ఈ సంఘటనపై అమెరికా ఎయిర్‌లైన్స్‌ దర్యాప్తు జరుపుతోంది. శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి డల్లాస్‌ వెళ్తున్న 'ఫ్లైట్‌ 591'లో బయలుదేరడానికి ముందు ఈ సంఘటన జరిగిందని ఎయిర్‌లైన్స్‌ మహిళా ప్రతినిధి లెస్లీ స్కాట్‌ తెలిపారు. ఒక మహిళా ప్రయాణీకురాలు విమానంలోకి స్ట్రాలర్‌ను తీసుకు రావడంతో వివాదం మొదలైందని స్కాట్‌ వెల్లడించారు.  ఈ ఘటనపై ఎయిర్‌లైన్స్‌ యాజమాన్యం క్షమాపణలు చెప్తున్న‌ద‌ని మహిళతో దురుసుగా ప్రవర్తించిన సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగించామ‌ని వివ‌రించారు.

కాగా, చికాగో పౌరయాన సంస్థకు చెందిన పోలీసు ఒకరు అమెరికా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం నుంచి 69 ఏళ్ళ డాక్టర్‌ డేవిడ్‌డావోను బయటకు లాగడంతో అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఘటన చోటచేసుకుని వారం రోజులు కూడా గడవక ముందే మరో సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు