మూత్రం తాగి నిర‌స‌న తెలిపిన రైతులు

మూత్రం తాగి నిర‌స‌న తెలిపిన రైతులు

త‌మిళ‌నాడు రైతుల ఆందోళ‌న తారాస్థాయికి చేరింది. త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఉద్య‌మించ‌నున్న‌ట్లు తెలిపిన స‌ద‌రు రైతులు అన్నట్టే చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల వైఖరికి నిర‌స‌న‌గా తమిళనాడు రైతులు ఇవాళ ఢిల్లీలో మూత్రం తాగారు. గ‌త 38 రోజులుగా ఢిల్లీలో త‌మిళ‌నాడు రైతులు జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ధ‌ర్నా చేస్తున్నారు.

కరువు నిధులు విడుదల చేయాలని, రుణాలను మాఫీ చేయాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం నుంచి కానీ, రాష్ట్రం నుంచి కానీ వాళ్ల‌కు ఎటువంటి స‌హాయం అంద‌లేదు. దీంతో ఇవాళ వాళ్లు మూత్రాన్ని సేవిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.

కాగా, తమిళ రైతులు వినూత్న రీతిలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ వ‌స్తున్నారు. రోజూ ఓ ర‌క‌ర‌కాలుగా ప్రదర్శన ఇచ్చారు. రైతుల పుర్రెలతో ధర్నా చేశారు. ఎలుకలు, పాముల్ని కొరికారు. అర్థనగ్న ప్రదర్శనలు చేశారు. రైతులు ఎన్ని రకాల ప్రదర్శనలు చేపట్టినా కేంద్రం మాత్రం స్పందించలేదు.

దీంతో ఇవాళ మరింత వినూత్నంగా ప్రదర్శన చేప‌ట్టారు. బాటిళ్లలో మూత్రాన్ని సేక‌రించి దాన్ని తాగారు. ఒకవేళ ప్రభుత్వంలో ఎటువంటి చలనం రాకుంటే, ఇక ఆదివారం రోజున మలవిసర్జనను కూడా సేవిస్తామని హెచ్చరికలు చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు