పవన్‌కళ్యాణ్‌జీ... ఇదేమైనా సినిమా షూటింగా?

పవన్‌కళ్యాణ్‌జీ... ఇదేమైనా సినిమా షూటింగా?

'ముందస్తు ఎన్నికలు వస్తే జనసేన సిద్ధం' అంటూ పవన్‌కళ్యాణ్‌ ఒక పవర్‌ఫుల్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఇది ఏదైనా సినిమాలో డైలాగ్‌గా పెడితే బ్రహ్మాండంగా పేలి వుండేది. కానీ రియాలిటీలో దీనిని సీరియస్‌గా తీసుకోవడానికి లేదు. హార్డ్‌కోర్‌ పవన్‌ అభిమానులు కూడా 'జనసేన సిద్ధం' అంటే నమ్మరు.

క్షేత్ర స్థాయిలో కనీసం పార్టీ ఆఫీసు కానీ, కేడర్‌ కానీ లేని పార్టీ ఎన్నికలకి సిద్ధమా? యాక్షన్‌ అనగానే అన్నీ సిద్ధమైపోవడానికి ఇదేమైనా సినిమా షూటింగా? నెక్స్‌ట్‌ సినిమా షూటింగ్‌కి నేను రెడీ అన్నంత తేలిగ్గా పవన్‌కళ్యాణ్‌ ఈ స్టేట్‌మెంట్‌ ఇచ్చేసాడు. ఇంతవరకు ఒక వారం రోజుల పాటు ఒకే ఇష్యూ మీద పవన్‌ టైమ్‌ గడిపింది లేదు. జనాల్లో పట్టుమని పది రోజులు తిరిగింది లేదు.

ట్విట్టర్‌లో చాట భారతాలకి తప్ప ఇంతవరకు పవన్‌ జనసేన సీరియస్‌గా తలకెత్తుకుని చేసిన పనేమీ లేదు. అంత ఆర్భాటంగా పార్టీ అనౌన్స్‌ చేసి, అన్ని నెలల పాటు రోడ్‌ షోలు చేసి, ప్రచారం మీద కోట్లు ఖర్చుపెట్టిన చిరంజీవికే పద్ధెనిమిది సీట్లు వచ్చాయి. అసలు పవన్‌ పార్టీ ఎన్నికలకి సిద్ధమని ఎలా అంటోంది? ఒకటి, రెండు స్థానాల్లో మాత్రమే పోటీ చేసే ఆలోచనతో పవన్‌ ఇలా అంటున్నాడా? లేక నిజంగానే తన పార్టీ సిద్ధమనే భ్రమలో వున్నాడా? ఒక టైమ్‌లో పొలిటికల్‌గా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతాడని అనిపించిన వాడే ఇప్పుడు ఒక రకమైన జోక్‌లా అనిపిస్తున్నాడని సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ పడుతున్నాయి. మరి ఈ విమర్శలకి జనసేనాని ఏ విధంగా బదులిస్తాడో? ఎలా వారి నోళ్లు మూయిస్తాడో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు