న్యూజిలాండ్ మ‌న‌ల్ని ఎందుకు వ‌ద్దంటోంది?

న్యూజిలాండ్ మ‌న‌ల్ని ఎందుకు వ‌ద్దంటోంది?

తమ దేశీయులకు గండి కొడుతూ విదేశీయులు ఉద్యోగావకాశాలు తన్నుకు పోతున్నారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇతర దేశీయులకు వీసాలు నిరాకరించిన నేపథ్యంలో ప‌లు దేశాలు అదే బాట‌లో న‌డుస్తున్నాయి. ఇప్ప‌టికే ఆస్ట్రేలియా ఈ ప్ర‌క‌ట‌న చేయ‌గా మ‌రో దేశ‌మైన న్యూజిలాండ్‌ కూడా అదే బాట పట్టింది. తాజాగా న్యూజిలాండ్‌ వలస వ్యవహారాల మంత్రి మైకేల్‌ వుడ్‌హౌస్‌ ఒక ప్రకటన విడుద‌ల చేస్తూ కొత్త వలస విధానంలో భాగంగా 'కివీస్‌ ఫస్ట్‌' విధానాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే న్యూజిలాండ్ నిర్ణ‌యం యువ‌త సంక్షేమం కంటే రాజ‌కీయ కార‌ణాలు ఎక్కువ‌గా ఉండ‌టం ఆస‌క్తిక‌రం.

సెప్టెంబర్‌ 23న జరుగనున్న న్యూజిలాండ్‌ సార్వత్రిక ఎన్నికల్లో వలసలపై పోరు ప్రాధాన్యతాంశంగా మారుతోంది. ఇటీవలి కాలంలో న్యూజిలాండ్‌కు పెరిగిన వలసలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదపడటంతో పాటు వర్థమాన ప్రపంచంలో పటిష్టమైన స్థూల దేశీయ ఉత్పాదకత (జీడీపీ) పెరుగుదలకు కూడా సహాయపడింది!! అయితే తక్కువ స్థాయిలో ఉన్న వేతనాలు, పెరుగుతున్న ఇళ్ల ధరల వంటి వాటిని ప్రస్తావిస్తూ ఇటు ప్రతిపక్షాలతో పాటు అటు న్యూజిలాండ్‌ కేంద్ర బ్యాంకు కూడా ప్రస్తుత విధానాలను పునఃసమీక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. దీంతో న్యూజిలాండ్ ప్ర‌భుత్వం ఈ కొత్త నిబంధ‌న‌ను ఎత్తుకొని విదేశీయుల‌కు షాక్ ఇచ్చింది.


కాగా, దేశీయులకు- విదేశీయులకు మధ్య ఉద్యోగావకాశాల్లో సమతుల్యత పాటించేందుకు వీలుగా వలస విధానంలో మార్పులు తలపెట్టామని మంత్రి తెలిపారు. న్యూజిలాండ్‌లో యాజమాన్యాలు స్వదేశీయులకే అధికశాతం ఉద్యోగావకాశాలు కల్పించటంతో పాటు వారిలో నైపుణ్యాన్ని పెంచేందుకు శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహించాల్సి ఉంటుందని మంత్రి తన ప్రకటనలో వివరించారు. వీసా విధానంలో ప్రతిపాదిస్తున్న మార్పుల్లో కనీస ఆదాయ అర్హతతో పాటు సీజనల్‌ కార్మికులు న్యూజిలాండ్‌లో వుండే కాల వ్యవధిని తగ్గించే అంశాలు ప్రధానమైనవి. ప్రధానంగా కనీసాదాయ అర్హత నిబంధనతో వీసాహోల్డర్లతో కలిసి జీవించేందుకు వారి కుటుంబ సభ్యులకు మరింత కష్టసాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. వీసా విధానంలో చేసిన మార్పుల ప్రకారం ప్రాధాన్యత కలిగిన 'స్కిల్డ్‌' శ్రేణిలో ఉద్యోగంలో ప్రవేశించే వారికి యాజమాన్యాలు కనీసం 49 వేల న్యూజిలాండ్‌ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. 73 వేల డాలర్లకు పైగా ఆదాయం కలిగిన వారిని అత్యంత నిపుణుల (హైలీ స్కిల్డ్‌)గా పరిగణిస్తారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు