మాజీ సీఎం గుట్టుర‌ట్టు చేసిన డైన‌మిక్ సీఎం

మాజీ సీఎం గుట్టుర‌ట్టు చేసిన డైన‌మిక్ సీఎం

ఆయ‌న కేంద్ర ర‌క్ష‌ణ శాఖా మంత్రి హోదాలో ప‌నిచేశారు. మాజీ సీఎం కూడా. అవ‌కాశం వ‌స్తే ప్ర‌ధానమంత్రి కావాల‌ని కూడా ప్ర‌య‌త్నించారు. ఇంత గొప్ప మ‌నిషి క‌నీసం క‌రెంటు బిల్లు క‌ట్టాల‌న్న విష‌యాన్నీ మ‌రిచారు. కావాల‌నే క‌ట్ట‌లేదన‌డం స‌బ‌బేమో. ఆయ‌న పేరు ములాయం సింగ్ యాద‌వ్‌.

దేశంలోనే పెద్ద‌దైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు సీఎంగా ప‌నిచేశారు. కానీ ఏకంగా రూ.4 ల‌క్ష‌ల క‌రెంటు బిల్లు ఎగ్గొట్టారు. వీఐపీ సాంప్ర‌దాయానికి తెర‌వేయాల‌న్న ఉద్దేశంతో యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ఆదేశాల మేర‌కు అధికారులు చేప‌ట్టిన త‌నిఖీల్లో ఈ విష‌యం వెల్ల‌డైంది.

నిజానికి ములాయం సింగ్‌కు రోజుకు 5 కిలోవాట్ల విద్యుత్ వినియోగానికి అనుమ‌తి ఉంది. కానీ నెల‌లో 8 సార్లు దానిని అధిగ‌మించిన‌ట్లు ఆయ‌న ఇంటికి త‌నిఖీల‌కు వ‌చ్చిన అధికారులు గుర్తించారు. బ‌కాయి ప‌డిన ఆ బిల్లును ఈ నెల చివ‌రిలోపు క‌ట్టాల‌ని అధికారుల‌కు ఆయ‌న‌కు డెడ్‌లైన్ విధించారు.

ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం ఇటావాలో ములాయం ఇల్లే పెద్ద‌ది. ఆ ఇంట్లో 12కుపైగా ల‌గ్జ‌రీ గ‌దులు, ప్ర‌త్యేకంగా ఓ ఎయిర్ కండిష‌నింగ్ ప్లాంట్‌, ఉష్ణోగ్ర‌త‌ల‌ను నియంత్రించుకునే స్విమ్మింగ్‌పూల్‌, కొన్ని ఎలివేట‌ర్స్ ఆ ఇంట్లో ఉన్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు