బాబు-మోడీ బంధం భయం : బెంబేలెత్తుతున్న వైకాపా!

బాబు-మోడీ బంధం భయం : బెంబేలెత్తుతున్న వైకాపా!

సుపరిపాలనతో సాధించగల అభివృద్ధి అనే పదానికి నిర్వచనంలా మారిన గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేందమ్రోడీ, ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా కంటె సీఈవోగా కీర్తి తెచ్చుకున్న, సీఎంగా వెరీ గుడ్‌ ఎడ్మినిస్ట్రేటర్‌గా పేరుతెచ్చుకున్న చంద్రబాబునాయుడు ఇద్దరూ ఒక జట్టు కడుతూ ఉండడం అనేది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో గుబులు పుట్టిస్తోంది. తెలుగుదేశం పార్టీ, భాజపా మధ్య గనుక పొత్తులు కుదిరితే.. సమైక్యం అనే పదాన్ని ఆపద్ధర్మంగా వాడుకుంటూ తాము చేస్తున్న అవకాశవాద పోరాటానికి విలువ లేకుండా పోతుందని, తమ దృష్టి కేవలం సీమాంధ్ర ప్రాంతానికి మాత్రమే పరిమితం అయి ఉన్నప్పటికీ.. చంద్రబాబు చేతిలో పరాభవం చవిచూడాల్సి వస్తుందేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. తమకు కేవలం సీమాంధ్రలో మాత్రమే అస్తిత్వం ఉంది. అదే అటు చంద్రబాబునాయుడుకు గానీ,  భాజపాకు గానీ.. రెండు ప్రాంతాల్లోనూ అస్తిత్వం ఉంది. ఈ రెండు పార్టీలు కలిసి ఒకరికి ఒకరు కొద్ది శాతం ఓట్లు మేలయ్యేలా లాభపడినా కూడా.. తమకు మాత్రం.. టెంకిజెల్ల తప్పదని వైకాపా భయపడుతోంది.
 
అందుకే తెదేపా- భారతీయ జనతాపార్టీల మధ్య పొత్తులు కుదురుతాయని అనుకుంటున్న వేళ.. ఈ ఇరుపార్టీల మధ్య అపోహలు సృష్టించడానికి వైకాపా తన వంతు ప్రయత్నం చేస్తున్నది. పొత్తులు నిర్ణయించుకునే విషయంలో.. వైకాపా వంటి ఉపప్రాంతీయ పార్టీల ఆలోచనల్ని, భయాల్ని, ప్రచారాల్ని పట్టించుకునే స్థితిలో భాజపా ఉండదనే విషయం నిజమే గానీ.. ఈ ఇరు పార్టీల మధ్య రకరకాల తగాదాలు అనుమానాలు ఉన్నాయంటూ తన మీడియా ద్వారా ప్రచారం చేసే ప్రయత్నంలో ఉంది వైకాపా.

అయితే పొత్తు కుదిరితే మేలే అనుకుంటున్న తెలుగుదేశం నాయకులు మాత్రం ఇలాంటి ప్రచారాన్ని తేలిగ్గా కొట్టి పారేస్తున్నారు. తెదేపాను ఎన్డీయేలోకి చేరనివ్వడానికి  భాజపా అసలు సుముఖంగా లేదని, చంద్రబాబును ఢిల్లీ నేతలు అందరూ ఈసడిరచుకున్నట్లుగా మాట్లాడారని.. రకరకాల ప్రచారాలతో పొత్తులు కుదరకుండా ఉండేందుకు కొన్ని కథనాల్ని వండి వార్చింది వైకాపా మీడియా. సరిగ్గా మోడీతో కలిసి ఒకే వేదికను చంద్రబాబునాయుడు కూడా పంచుకుని.. కలిసి సంభాషించుకోనున్న ఈ రోజున ఇరువురి మధ్య సదభిప్రాయాలు లేవన్నట్లు, చంద్రబాబుపై మోడీ ఆగ్రహంగా ఉన్నట్లు వైకాపా ప్రచారం చేస్తోంది. అయితే ప్రచారాన్ని సైతం యావత్తు ప్రపంచమూ వైకాపా వాయిస్‌గానే భావిస్తారు గనుక.. ఆ ప్రచారానికి పెద్ద విలువ ఉండకపోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు