నవ భారత్ నేషనల్ పార్టీ ఎన్టీఆర్ ది కాదట..

నవ భారత్ నేషనల్ పార్టీ ఎన్టీఆర్ ది కాదట..

కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో సంచలనంగా మారిన జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీ అంశానికి తెరపడింది. దీనిపై స్వయంగా జూనియరే స్పందించడంతో ఈ ప్రచారానికి తెరపడింది.
   
'నవ భారత్ నేషనల్ పార్టీ' పేరుతో ఏర్పాటు చేసిన కొత్త రాజకీయ పార్టీకి ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ను అధ్యక్షుడిగా నియమించినట్టు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ లేఖ వైరల్ అయింది. ప్రింటు, టీవీ మీడియాలోనూ దీనిపై కథనాలు వచ్చాయి.   తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉండాల్సిన జూనియర్ సొంత కుంపటి పెట్టుకున్నాడా? అంటూ పలువురు ఆశ్చర్యపోయారు. లోకేశ్, చంద్రబాబులతో ఆయనకకు ఉన్న విభేదాల నేపథ్యంలోనూ ఇది నిజం కావొచ్చనుకున్నారు.
  
 అయితే... ఈ విషయం 'జై లవకుశ' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న జూనియర్ కు తన అభిమానుల ద్వారా తెలిసింది. దీంతో, అతను ఓ చిరునవ్వు నవ్వేశాడట. ఇలాంటి పుకార్లను తాను పట్టించుకోనని చెప్పాడట. అంతేకాదు, ఈ వార్తలను ఎవరూ పట్టించుకోవద్దని, ఈ మ్యాటర్ ను ఇంతటితో వదిలేయాలని చెప్పాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు