అద్వానీ రాష్ర్టపతి ఆశలకు సుప్రీం బ్రేక్

అద్వానీ రాష్ర్టపతి ఆశలకు సుప్రీం బ్రేక్

రాష్ట్రపతి రేసులో ఉన్నారని భావిస్తున్న బీజేపీ కురువృద్ధుడు అద్వానీకి సుప్రీం కోర్టు తీర్పుతో గట్టి దెబ్బ తగిలింది.   ఆయన రాష్ట్రపతి రేసు నుంచి దాదాపు తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో ఆయన్ను విచారించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అద్వానీతో పాటు మురళీమనోహర్ జోషి, ఉమాభారతితో పాటు 16మంది నేతలపై  కేసు పునరుద్దరించి విచారణ జరిపాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. రెండేళ్లలో వీరిపై విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది.

గతంలో కేసు నుంచి అద్వానీ పేరును అలహాబాద్ కోర్టు తొలగించింది. అయితే సుప్రీం కోర్టు మాత్రం అద్వానీపై కేసు పునరుద్దరించి విచారించాలని ఆదేశించింది.  లక్నో ట్రయల్‌ కోర్టులో వీరిపై విచారణ జరిపేందుకు అంగీకరించింది. కేసు విచారణ 25 ఏళ్లు సాగడం అంటే న్యాయాన్ని నిరాకరించడమే అవుతుందని… కాబట్టి ఈ కేసు రోజువారి విచారణకు ఆదేశిస్తున్నట్టు చెప్పారు. కేసు విచారణ పూర్తయ్యే వరకు న్యాయమూర్తులను బదిలీ చేయవద్దని కూడా సుప్రీం ఆదేశించింది.
  
కాగా ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ పేరును మాత్రం కేసు విచారణ నుంచి సుప్రీం మినహాయింపు ఇచ్చింది. కేంద్ర మంత్రిగా ఉన్న ఉమాభారతి విషయంలో మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.అద్యానీ, మురళీమనోహర్ జోషి, ఉమాభారతి తదితరులు రెచ్చగొట్టే ప్రసంగాల చేయడం వల్లే కర సేవకులు బాబ్రీమసీదును కూల్చినట్టు అభియోగాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు