పవన్ అంటే పడిచచ్చే వైసీపీ ఎమ్మెల్యే

పవన్ అంటే పడిచచ్చే వైసీపీ ఎమ్మెల్యే

రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన సినిమా హీరోల మీద అభిమానం చచ్చిపోదు కొందరు నాయకులకు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి నందమూరి బాలకృష్ణకు పెద్ద అభిమాని అన్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లో బాలయ్య ఆయనకు శత్రువైనా సరే.. అప్పుడప్పుడూ తన అభిమానం చాటుకుంటూ ఉంటాడు జగన్.

ఈ మధ్య తెలుగుదేశం ఎమ్మెల్యేలందర్లోకి బాలయ్య ది బెస్ట్ అంటూ అసెంబ్లీ లాబీలో పిచ్చాపాటిగా మాట్లాడుతూ జగన్ మాట్లాడటం ఆసక్తి రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఐతే వైకాపాకే చెందిన మరో ఎమ్మెల్యే అయితే బాహాటంగానే తనకున్న సినీ అభిమానాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆ ఎమ్మెల్యే మరెవరో కాదు.. నెల్లూరు సిటీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అనిల్ కుమార్ యాదవ్.

ఈ ఎమ్మెల్యేకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అభిమానమట. తాను టీనేజీలో ఉన్న రోజుల నుంచి పవన్ కళ్యాణ్‌ను ఆరాధించేవాడినని అనిల్ కుమార్ చెబుతున్నాడు. రెండు దశాబ్దాల కిందట పవన్ హీరోగా అరంగేట్రం చేసినపుడే ఆయన అభిమానిగా మారిపోయానని.. ఎప్పుడూ పవన్ సినిమాను ఫస్డ్ డే ఫస్ట్ షో చూసేవాడినని.. ఇప్పటికీ పవన్ సినిమాల్ని మిస్ కానని అంటున్నాడు అనిల్.

పవన్ కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిన ‘జానీ’ సినిమాను తాను తొమ్మిదిసార్లు చూసినట్లు అనిల్ వెల్లడించడం విశేషం. సినిమా ఎలా ఉందన్నది నాకు ముఖ్యం కాదు.. తెర మీద పవన్‌ను చూడటమే ఆనందం కలిగించేదని.. అందుకే పవన్ ప్రతి సినిమాను మళ్లీ మళ్లీ చూసేవాడినని అనిల్ అన్నాడు. పవన్ రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ ఎన్నో విమర్శలు గుప్పించగా.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పవన్‌‌పై ఇంతటి అభిమానం చాటుకోవడం విశేషమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు