ఆ మ‌హిళా ఎంపీ రోజూ తాగుతార‌ట‌

ఆ మ‌హిళా ఎంపీ రోజూ తాగుతార‌ట‌

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో రాజ‌కీయ నేత‌ల‌కు, వివాదాల‌కు విడ‌దీయ‌రాని బంధం ఉంది అన్నట్లుగా ప‌రిస్థితులు మారిపోయాయి. కొంద‌రు ఉద్దేశ‌పూర్వ‌కంగా కామెంట్లు చేస్తుండ‌గా మ‌రికొంద‌రి మాట‌లు అనంత‌రం వివాదం రూపం దాల్చుతున్నాయి. రెండో కేట‌గిరీలోకి వ‌చ్చే సంద‌ర్భం ఇది. మ‌హారాష్ట్ర‌లోని స్వ‌తంత్ర ఎమ్మెల్యే ఓ వివాదంపై మాట్లాడ‌బోయి మ‌రో వివాదానికి తెర‌లేపారు. బ‌చ్చు కాడు అనే ఆ ఎమ్మెల్యే బీజేపీ ఎంపీ హేమమాలినిపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఆమె తాగుబోతు అని వ్యాఖ్యానించి ఇరకాటంలో ప‌డ‌డ్డారు.

మ‌హారాష్ట్రలో పెద్ద ఎత్తున జ‌రుగుతున్న రైతు ఆత్మ‌హత్య‌లపై ఎమ్మెల్యే స్పందిస్తూ అన్న‌దాత‌ల ఆత్మ‌హ‌త్య‌ల‌కు తాగుడే కార‌ణ‌మ‌న్న వాద‌న‌ను ఖండించారు. నాందేడ్‌లో ఎమ్మెల్యే బ‌చ్చు కాడు మీడియాతో మాట్లాడుతూ...`రైతులు తాగ‌డ‌మే కార‌ణం అయితే...మ‌రి హేమ మాలిని రోజూ తాగుతారు క‌దా! ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకున్నారా?` అంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. పెళ్లిళ్ల‌కు అధికంగా ఖ‌ర్చు చేయ‌డం కూడా రైతు ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణం కాద‌ని  ఎమ్మెల్యే బ‌చ్చు కాడు స్ప‌ష్టంచేశారు. ఈ సంద‌ర్భంగా మ‌రో కామెంట్ చేశారు. కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ఇంట్లో శుభ‌కార్యాన్ని ఉద‌హ‌రిస్తూ... `గ‌డ్క‌రీ నాలుగు కోట్లు ఖ‌ర్చు పెట్టి కొడుకు పెళ్లి చేశారు. ఆయ‌న ఆత్మ‌హ‌త్య చేసుకుంటారా?` అంటూ బ‌చ్చు కాడు ప్ర‌శ్నించారు.

మ‌హారాష్ట్ర‌లో క‌రువు కార‌ణంగా రోజూ ఎక్కడో ఓ చోట రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటూనే ఉన్నారు. ఈ ఆత్మ‌హ‌త్య‌ల‌కు నిజ‌మైన కార‌ణం డ‌బ్బు లేక‌పోవ‌డ‌మే అని కాడు చెప్పారు. ఎమ్మెస్ స్వామినాథన్ చెప్పిన‌ట్లు.. రైతుల ఉత్ప‌త్తి పెరుగుతున్నా వారి ఆదాయం మాత్రం పెర‌గ‌డం లేదు అని ఆయ‌న అన్నారు. రైతుల‌కు మేలు చేసే విధానాల‌ను ప్ర‌భుత్వాలు అవ‌లంభించాల‌ని త‌ద్వారా వారికి వ్య‌వ‌సాయం పండుగ‌లా చేయాల‌ని అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు