'రెండేళ్లలో హరీశ్ రావు సీఎం'

'రెండేళ్లలో హరీశ్ రావు సీఎం'

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ లీడర్, సోనియాగాంధీకి వీర భక్తుడు అయిన సర్వే సత్యనారాయణ చెప్పిన ఓ జోష్యం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ పార్టీలో వచ్చే రెండేళ్లలో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయన్న విషయంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

రానున్న రెండేళ్లలో కేసీఆర్ పదవి పోగోట్టుకుంటారని.. ఆయన స్థానంలో మేనల్లుడు హరీశ్ రావు సీఎం అవుతారని.. అది ఖాయమని సర్వే సత్యనారాయణ ఘంటాపథంగా చెబుతున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆయన మేనల్లుడు హరీష్ రావు వెన్నుపోటు పొడిచి సీఎం అవుతారని ఆయన  జోస్యం చెప్పారు. వక్రమార్గంలో హరీష్ ముఖ్యమంత్రి కాబోతున్నారని తెలిపారు.

టీఆర్ఎస్ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం హరీష్ ఎంతో కష్టపడ్డాడని, కేసీఆర్ కు కుడి భుజంగా అన్నీ తానై వ్యవహరించాడని... కానీ, ఇప్పుడు ఆయనను కేసీఆర్ పక్కన పెట్టేశారని అన్నారు. కుమారుడు కేటీఆర్, కుమార్తె కవితలకు పార్టీ పగ్గాలను కేసీఆర్ అప్పగించారని... ఈ నేపథ్యంలో, హరీష్ రావు చూస్తూ ఎందుకు ఊరుకుంటాడని సర్వే అన్నారు. సర్వే వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు