సీఎం తల తెస్తే 11 లక్షల బహుమతి

సీఎం తల తెస్తే 11 లక్షల బహుమతి

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తల నరికిన వారికి రూ.11లక్షలు రివార్డు ఇస్తానంటూ  ఓ యువ బీజేపీ నేత ప్రకటించారు. బీజేవైఎం నాయకుడైన యోగేష్ వార్ష్నీ చేసిన  ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆమె ముస్లింలకు మద్దతుగా నిలుస్తున్నారని.. హిందువులను అణగదొక్కుతున్నారని ఆరోపిస్తూ ఆయన ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

హనుమాన్ జయంతి సందర్భంగా బెంగాల్లోని బీర్బమ్ జిల్లాలో భారీ ర్యాలీ తీశారు.  అయితే ర్యాలీలపై నిషేధం ఉండటంతో పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో ర్యాలీ నిర్వాహకులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు లాఠీ చార్జి చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన యోగేష్ హనుమజ్జయంతి సందర్భంగా జరిగే ర్యాలీని అడ్డుకుని లాఠీ చార్జి సంఘటనకు సీఎం మమతా బెనర్జీని బాధ్యురాలిగా పేర్కొంటూ, ఆమె తల నరికిన వారికి 11 లక్షలు రివార్డు ప్రకటించారు.

రామ నవమి, సరస్వతి పూజలాంటి పండుగలను రాష్ట్రంలో జరుపుకోనివ్వడం లేదంటూ ఆయన మండిపడ్డారు. ఇఫ్తార్ పార్టీలను మాత్రం మమత నిర్వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మమత పూర్తిగా ముస్లిం మద్దతుదారుగా మారిపోయారని ఆయన ఆరోపించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు