ట్రంప్ లాగే ఆయ‌న ఫ్యామిలీ కూడా షాకులు ఇస్తోంది

ట్రంప్ లాగే ఆయ‌న ఫ్యామిలీ కూడా షాకులు ఇస్తోంది

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మాత్రమే కాదు ఆయన కుటుంబ సభ్యులు సైతం ఖర్చు విషయంలో చుక్కలు చూపిస్తున్నారు. వీరి లైఫ్‌ స్టైల్‌ చూసి అధికారులు పరేషాన్ అవుతున్నారట‌. వీకెండ్‌ వస్తే చాలు రిసార్ట్ లు, భారీ విందులతో జనం ధనాన్ని నీళ్లలా ఖర్చు చేస్తున్నారని అమెరిక‌న్ మీడియా గ‌గ్గోలు పెడుతోంది. ట్రంప్‌ ఒకచోట ఆయన భార్య మెలానియా మరో చోట ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మెలానియా ట్రంప్‌ కు భద్రత కల్పించేందుకు సైతం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు.

ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టి ఇప్పటి 10 వారాలు గడిచింది. ఈ పదివారాల్లో ఏడు వీకెండ్‌ లలో ‘మర్‌-ఏ-లగో’ అనే రిసార్టు లో ట్రంప్‌ గడిపారు. ఈ రిసార్ట్ లో ఒక్కో ట్రిప్‌ నకు భద్రతా ఏర్పాట్లతో కలిసి 30లక్షల డాలర్లకు పైనే ఖర్చు అయ్యింది. ఏడు వారాల్లో ఏకంగా 2కోట్ల 40లక్షల డాలర్ల బిల్లు చేశారట. ఇది అమెరికా అధ్యక్షుడిగా బరాక్‌ ఒబామా తన పర్యటనల కోసం తొలి రెండేళ్లలో పెట్టిన ఖర్చుతో సమానం కావడం విశేషం!

బరాక్‌ ఒబామా పదవిలో ఉన్నప్పుడు ఎనిమిదేళ్లలో ఆయన పర్యటనల బిల్లు మొత్తం 97మిలియన్‌ డాలర్లు అయ్యింది.  సగటున ఏడాదికి 12 మిలియన్‌ డాలర్లు. ఐతే ట్రంప్‌ మాత్రం ఒక్క నెలలోనే 10 మిలియన్‌ డాలర్ల బిల్లు చేశారు. ఇలాగే కొనసాగితే.. కేవలం పది నెలల్లోనే ఒబామా ఎనిమిదేళ్లలో చేసిన ఖర్చును మించిపోవచ్చని అధికారులు చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు