బాలయ్య చెప్పినా ప‌ట్టించుకోవ‌ద్దంటున్న లోకేష్

బాలయ్య చెప్పినా ప‌ట్టించుకోవ‌ద్దంటున్న లోకేష్

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు, మంత్రి నారా లోకేష్ ప‌రిపాల‌న‌లో త‌న‌దైన శైలిలో ముద్ర వేసుకునేందుకు ముందుకు సాగుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. తాజాగా మంత్రి ప‌ద‌వి బాధ్య‌తలు చేప‌ట్టిన లోకేష్ బాధ్య‌త‌ల నిర్వ‌హ‌ణ‌లో విమ‌ర్శ‌లు పాలు కాకుండా పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హరించేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో పైర‌వీల‌కు దూరంగా ప‌రిపాల‌న ఉండాల‌ని లోకేష్ స్ప‌ష్టం చేశారు. ఎవ‌రి రికమండేష‌న్లు అయినా, ఆఖ‌రుకు త‌న మామ నంద‌మూరి బాల‌కృష్ణ చెప్పినా చేయ‌కూడ‌ద‌ని లోకేష్ ఆదేశించారు.

మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన అనంత‌రం అధికారుల‌తో స‌మావేశ‌మైన నారా లోకేష్ సుప‌రిపాల‌న‌కు త‌న శాఖ కేంద్రంగా నిల‌వాల‌ని ఆకాంక్షించారు. నిర్ణ‌యాల‌ను అమ‌లు చేయాల్సింది అధికారులే కాబట్టి వారు నిజాయితీగా, ప్ర‌జ‌లకు మేలు చేసేలా వ్య‌వ‌హ‌రించాల‌ని కోరారు. లాలూచీలు, పైరవీలకు చాన్స్ లేకుండా ఉండటానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాల‌న్నారు. అందుకే ఎలాంటి రికమండేషన్స్ ను ప్రోత్సహించవద్దని అధికారులకు లోకేష్ స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంలో ఎంత‌టి వారైనా ప‌ట్టించుకోవ‌ద్ద‌ని తెలిపారు. తన పేరు చెప్పి ఎవరైనా ఫోన్ చేసినా, త‌న మామ బాల‌కృష్ణ చెప్పినా స‌రే ప‌ట్టించుకోవ‌ద్ద‌ని లోకేష్ స్ప‌ష్టం చేశారు.

కాగా, రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా శుక్ర‌వారం పదవీ బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్ తన తొలి రాజకీయ అడుగు పేదల వైపు ఉంటుందన్న సంకేతాలిచ్చారు. మంత్రిగా ఆయన తొలిరోజు పేదల జీవితాలకు సంబంధించిన మూడు ఫైళ్లపై సంతకం చేశారు. ఉపాధి హామీ పథకంలో ఏడాదిలో 50 రోజులు పనిచేసిన కుటుంబాలను భవన నిర్మాణ కార్మికులుగా గుర్తించాలన్న డిమాండ్ సుదీర్ఘకాలం నుంచి వినిపిస్తోంది.

దానికి సంబంధించి కార్మిక సంఘాలు, పలువురు ప్రజాప్రతినిధులు చాలాకాలం నుంచి ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించారు. లోకేష్ మంత్రిగా అదే ఫైలుపై తొలి సంతకం చేశారు. వారు పెళ్లి చేసుకుంటే పదివేలు, ప్రసూతికి 20 వేలు, ప్రమాద బీమాకు 5లక్షల రూపాయలిచ్చే ఫైలుపై సంతకం చేయడం ద్వారా తాను పేదలు, కార్మికుల పక్షాన ఉంటానన్న సంకేతాలిచ్చారు. ఇక పంచాయతీరాజ్ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన మరో ఫైలుపైనా లోకేష్ సంతకం చేశారు. .

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English