20 ఏళ్ల చిన్నోడితో పుతిన్ మాజీ వైఫ్ పెళ్లి

20 ఏళ్ల చిన్నోడితో పుతిన్ మాజీ వైఫ్ పెళ్లి

ప్ర‌పంచంలో అత్యంత శ‌క్తివంత‌మైన నాయ‌కుల్లో ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక‌రు. ర‌ష్యా రాజ‌కీయాల్లో తిరుగులేని శ‌క్తిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆయ‌న తీరుపై చాలానే విమ‌ర్శ‌లు.. వివాదాలు ఉన్నాయి. రాజ‌కీయ జీవితంలోనే కాదు.. వ్య‌క్తిగ‌త విష‌యాల్లోనూ ఆయ‌నపై విమ‌ర్శ‌లున్నాయి. దాదాపు 30 ఏళ్లు క‌లిసి జీవించిన భార్య‌కు 2013లో విడాకులు ఇచ్చేశారు. పుతిన్‌.. లుడ్మిలా ఇద్ద‌రూ 30 ఏళ్లు క‌లిసి ఉన్నారు. గుఢాచార సంస్థ‌లో ప‌ని చేసే స‌మ‌యంలో వీరిద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు. మొద‌ట్లో తూర్పు జ‌ర్మ‌నీలో నివ‌సించిన వారు.. త‌ర్వాత ర‌ష్యాకు రావ‌టం.. పుతిన్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చేశారు. అనూహ్యంగా దేశాధ్య‌క్షుడైన ఆయ‌న‌.. త‌ర్వాత కాలంలో అత్యంత శ‌క్తివంత‌మైన నేత‌గా ఎదిగారు.

పుతిన్ ఇంత ప‌వ‌ర్ ఫుల్ గా ఎదిగినా.. ఆయ‌న భార్య లుడ్మిలా మాత్రం ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. పుతిన్‌తో విడాకుల త‌ర్వాత ఆమె ఆచూకీ బ‌య‌ట‌ప్ర‌పంచానికి తెలియ‌కుండా పోయింది. ఆమె ఎక్క‌డు ఉంది? ఏం చేస్తోంది? అన్న అంశాల‌పై ఎవ‌రికి ఎలాంటి స‌మాచారం లేదు. ఇదిలా ఉండ‌గా.. తాజాగా ఆమెకు సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

త‌న కంటే 20 ఏళ్ల చిన్న‌వాడైన బిజినెస్ మ్యాన్ ఆర్థ‌ర్ ఓషెరెట్నీని పెళ్లి చేసుకున్న స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం వారు ఫ్రాన్స్ లోని ఒక విల్లాలో ఉంటున్న‌ట్లుగా ఒక వార్త బ‌య‌ట‌కు వ‌చ్ఇచంది. పెళ్లి త‌ర్వాత త‌న పేరులో పుతిన్ ను తొల‌గించిన‌ట్లుగా ఒక ర‌ష్య‌న్ వెబ్ సైట్ పేర్కొంది. తాజాగా ఈ జంట లండ‌న్‌లోని హీత్రూ విమానాశ్ర‌యంలో క‌లిసి ఉన్న ఒక ఫోటో ఇప్పుడు బ‌య‌ట‌కు రావ‌టంతో.. ఈ మొత్తం వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English