పెప్సీ యాడ్ ఇంత చెత్త‌గా ఉందేంటి?

పెప్సీ యాడ్ ఇంత చెత్త‌గా ఉందేంటి?

ప్ర‌ముఖ శీత‌ల పానీయాల సంస్థ పెప్సీ కంపెనీ రూపొందించిన కొత్త యాడ్ వివాదాస్ప‌ద‌మైంది. ఇంత చెత్త అని చాలా మంది అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. దీంతో పెప్సీ కంపెనీ ఇప్పుడు ఆ యాడ్‌ను తొలగించింది.  ఈ యాడ్‌లో....ఫోటో షూట్ చేస్తున్న ఓ మోడ‌ల్ అక‌స్మాత్తుగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హిస్తున్న ఆందోళ‌న‌కారుల‌తో జ‌త‌క‌డుతుంది. అంతేకాదు, భ‌ద్ర‌తా సిబ్బంది వ‌ద్ద‌కు వెళ్లి ఆ మోడ‌ల్ త‌న ద‌గ్గ‌ర ఉన్న పెప్సీ క్యాన్‌ను అందిస్తుంది. ఆ డ్రింక్ తాగ‌డంతో స‌మ‌స్య‌ల‌న్నీ స‌ద్దిమ‌ణిగిపోతాయి. ఇలా తీసిన పెప్సీ యాడ్‌పై అమెరికాలో తీవ్ర దుమారం రేగింది.

నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను పెప్సీ చాలా తేలిక‌గా చూపించింద‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. కానీ అమెరికాలో గ‌త కొన్నేళ్లుగా జాతివివ‌క్ష‌ను వ్య‌తిరేకిస్తూ ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఒబామా అధ్య‌క్షుడిగా ఉన్న‌ప్పుడు కూడా అక్క‌డ హింసాత్మ‌క ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రిగాయి. ఇప్పుడు అమెరికా కొత్త అధ్య‌క్షుడు ట్రంప్‌ను వ్య‌తిరేకిస్తూ కూడా ఆందోళ‌న‌లు చోటుచేసుకుంటున్నాయి.

ఈ నేప‌థ్యంలో పెప్సీ త‌న యాడ్‌తో ఎటువంటి సందేశాన్ని ఇస్తుంద‌ని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌జా ఉద్య‌మాలంటే ఇంత చుల‌క‌న భావమా? ఇంత చెత్త యాడ్ రూపొందించిన వ్య‌క్తి ఎవ‌రూ అంటూ పెప్సీ యాడ్‌పై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం కావ‌డంతో ఆ కంపెనీ దాన్ని తొలిగించింది. క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. యాడ్ లో మోడల్ గా టీవీ స్టార్ కెండల్ జన్నర్ నటించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు