ఐన్‌స్టిన్ లేఖ విలువ జ‌స్ట్ 35 ల‌క్ష‌లే

ఐన్‌స్టిన్ లేఖ విలువ జ‌స్ట్ 35 ల‌క్ష‌లే

అల్బర్ట్ ఐన్‌ స్టీన్‌..ప్రపంచం ప్ర‌ఖ్యాత భౌతిక శాస్త్రవేత్త. ఆయ‌న ప్ర‌వ‌చించిన సిద్ధాంతాలు ఇప్ప‌టికీ భౌతిక శాస్త్రాన్ని ఏలుతున్నాయి. అంత క్రేజ్ ఉంది కాబ‌ట్టే...ఆయన రాసిన రెండు పేజీల లేఖ 35 లక్షల రూపాయలు తెచ్చిపెట్టింది. ఐన్‌స్టిన్‌ లేఖకు వేలం నిర్వాహాకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఏకంగా వేలం ధ‌ర కంటే మూడు రెంట్లు ద‌ర ప‌లికి ఆశ్చ‌ర్య ప‌రిచింది.

కాగా, 1953లో ఐన్ స్టీన్ తన టీచర్ కు ఒక లేఖ రాశాడు. ఇప్పటికి ఆ లేఖ భద్రంగా ఉంది. కొంత‌ కూడా చెక్కు చెదరలేదు. అయితే ఆ లేఖను ఉన్న వ్యక్తి అమ్మకానికి పెట్టాడు. ఈ నేపథ్యంలో ఆ లేఖ రికార్డు స్థాయి ధరకు అమ్ముడు పోయింది. ఈ వేలంలో ప్రారంభ ధర 15000 డాలర్లు పెట్టారు. అయితే రికార్డు స్థాయిలో 53,503 డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే ఇండియన్ కరెన్సీలో చెప్పుకుంటే అక్షరాల 35 లక్షల రూపాయలు అన్నమాట.  

కాగా, అమ్ముడుపోయిన లేఖలో ఆర్ధర్ కన్వర్స్ అనే అధ్యాపకుడు రాసిన రెండు ప్రశ్నలకు ఐన్ స్టీన్ సమాధానాలిచ్చారు. అవి ప్రత్యేక సాపేక్షతా సిద్ధాంతంపైనా, ఎలక్ట్రో స్టాటస్టిక్ సిద్ధాంతం పై వివరణలు ఉన్నాయి. ఆ లేఖపై ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ అడ్వాన్స్డ్‌ స్టడీ ఉయ ప్రిన్స్‌ టన్, రూమ్‌ నంబర్‌ 115, న్యూ జెర్సీ’ అడ్రస్‌తో ఉంది. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత నిపుణుడి లేఖ సొంతం చేసుకోవ‌డం త‌నుక సంతోషంగా ఉంద‌న్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English