అచ్చూ...కేసీఆర్‌లాగే చేసిన లోకేష్‌

అచ్చూ...కేసీఆర్‌లాగే చేసిన లోకేష్‌

ఆంధ్ర‌ప్రదేశ్ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ప్ర‌క్రియ పూర్తయింది. ఈ కార్య‌క్ర‌మంలో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేష్ ప‌లువురిని ఆక‌ట్టుకున్నారు. ఆయ‌న‌తో పాటు దివంగత ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి-శోభా నాగిరెడ్డిల త‌న‌య అఖిల ప్రియ సైతం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణగా నిలిచారు. అరగంటలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తయ్యింది. ఈ కార్యక్రమం అనంతరం కొత్త మంత్రులను నాయకులు అభినందించారు.

అనంతరం మంత్రులు గ్రూప్ ఫొటో దిగారు. ఏపీ కేబినెట్ లో భూమా అఖిల ప్రియ అతి పిన్న వయస్కురాలు. పాతికేళ్లకే భూమా అఖిల ప్రియ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతే కాకుండా సరిగ్గా తన పుట్టిన రోజు నాడే అఖిల ప్రియ మంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం.

కాగా ప్రమాణ స్వీకారం అనంత‌రం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేశ్ పాదాభివందనం చేశారు. లోకేశ్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వేదికపైనే ఉన్న గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నారా లోకేశ్ కు బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన లోకేశ్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మంత్రిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన లోకేష్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంచాయతీ రాజ్ శాఖను కేటాయించారు. కాగా ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి నందమూరి కుటుంబం అంతా తరలి వ‌చ్చింది.

కాగా లోకేష్ కుమారుడు దేవాన్ష్ ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. దేవాన్ష్ ను తీసుకుని బ్రహ్మణి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. మొత్తం 11మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు