సుప్రీం సంచలనం: ఏప్రిల్ 1 నుండి మీరు ఆ వాహనాలు నడపలేరు

సుప్రీం సంచలనం: ఏప్రిల్ 1 నుండి మీరు ఆ వాహనాలు నడపలేరు

దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పును వెల్లడించింది. రోజురోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యానికి చెక్ పెట్టేందుకు ఊహించని రీతిలో తీర్పును ప్రకటించింది. బీఎస్ 4 (భారత్ స్టేజ్ 4) కర్బన ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా లేని అన్నివాహనాలపైనా నిషేధాన్ని విధించింది. అది కూడా ఎప్పుడో అన్నది కాకుండా వెను వెంటనే అన్నట్లు.. ఏప్రిల్ 1 నుంచి తమ తీర్పు అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది

వాహన పరిశ్రమకు భారీ షాక్ లాంటి ఈ నిర్ణయం ఇప్పుడు పెను సంచలనాన్ని సృష్టిస్తోంది. ఆటో మొబైల్ తయారీదారుల ప్రయోజనాల కంటే ప్రజారోగ్యమే తమకు ముఖ్యమన్న సుప్రీం కోర్టు..బీఎస్4 వాహనాల కంటే తక్కువ ప్రమాణాలున్న వాహనాల రిజిస్ట్రేషన్ పై ఏప్రిల్ 1 నుంచి నిషేధాన్ని విధించింది. దీంతో.. బీఎస్4 వాహనాల్ని రిజిస్ట్రేషన్లు చేయటానికి అనుమతించరు. అంతేకాదు..వాహనతయారీదారులు.. డీలర్లు ఏప్రిల్1 నుంచి బీఎస్4 వాహనాల్ని అమ్మకూడదు.

తాము ఎందుకీ నిర్ణయాన్ని వెల్లడించిన విషయాన్నితర్వాత వివరిస్తామన్న జస్టిస్ మదన్ బి  లోకూర్..జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన దర్మాసనం విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. మోటారు వాహనాల చట్టం1988 కింద బీఎస్4 ప్రమాణాలకు చేరుకోని వాహనాల విషయంలో కఠినంగా ఉండనున్నట్లు వెల్లడించింది. అంతేకాదు.. మార్చి 31 లోపు వాహనాలు అమ్మినట్లు ఏదైనా రుజువు చూపిస్తే తప్ప.. వాటి రిజిస్ట్రేషన్ కు ఏప్రిల్ 1 తర్వాత అవకాశం లేదని తేల్చిన కోర్టు తీర్పు నేపథ్యంలో..బీఎస్ 3 ప్రమాణాలతో కూడిన వాహనాలు పరిశ్రమల వద్ద 8.24 లక్షలు ఉన్నట్లుగా అంచనా కట్టింది.

వీటిల్లో 96వేలు వాణిజ్య వాహనాలు కాగా.. ఆరు లక్షలకు పైగా టూవీలర్స్.. 40వేల వరకూ త్రిచక్ర వాహనాలు ఉన్నట్లుగా చెప్పింది. ఈ తీర్పుపై పర్యవరణ వేత్తలు హర్షాన్ని వ్యక్తం చేస్తే.. సుప్రీం తీర్పు ఆటోమొబైల్ పరిశ్రమ మాత్రం అందుకు భిన్నంగా రియాక్ట్ అయ్యింది. తాజా తీర్పు పరిశ్రమపై అదనపు భారాన్ని మోపుతుందని.. వ్యయాలు పెరిగిపోతాయన్న ఆందోళనను వ్యక్తం చేసింది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English