ఇవే.. చిన్న‌మ్మ‌.. ప‌న్నీర్ పార్టీ పేర్లు.. గుర్తులు

ఇవే.. చిన్న‌మ్మ‌.. ప‌న్నీర్ పార్టీ పేర్లు.. గుర్తులు

అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో అధికార అన్నాడీఎంకే పార్టీ రెండు వ‌ర్గాలుగా చీలిపోయిన విష‌యం తెలిసిందే. ఒక వ‌ర్గానికి చిన్న‌మ్మ శ‌శిక‌ళ నేతృత్వం వ‌హిస్తుండ‌గా.. మ‌రో వ‌ర్గానికి అమ్మ వీర విధేయుడు ప‌న్నీర్ సెల్వం నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అమ్మ మ‌ర‌ణంతో ఖాళీ అయిన ఆర్కే న‌గ‌ర్ స్థానానికి తాజాగా జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌ల్లో రెండు వ‌ర్గాల వారు అభ్య‌ర్థుల్ని బ‌రిలోకి దింపుతున్నారు. ఈ నేప‌థ్యంలో.. ఇరువురు పార్టీ గుర్తు అయిన రెండాకుల కోసం ఈసీ ద‌గ్గ‌ర పోరాడారు.

తాజా ఎన్నిక‌కు రెండాకుల గుర్తును ఎవ‌రికీ కేటాయించ‌ని ఈసీ.. ఇరు పార్టీల‌కు కొత్త గుర్తుల్ని కేటాయిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. అదే స‌మ‌యంలో రెండు వ‌ర్గాలు.. త‌మ పార్టీ పేర్ల‌ను వేర్వేరు ప్ర‌క‌టించాల్సి వ‌చ్చింది. దీంతో.. కొత్త పార్టీ పేర్లు.. గుర్తుల‌తో  రెండు వ‌ర్గాలు ఉప ఎన్నిక బ‌రిలో దిగాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఈ నేప‌థ్యంలో శ‌శిక‌ళ వ‌ర్గం త‌మ పార్టీని అన్నాడీఎంకే అమ్మ‌గా ప్ర‌తిపాదించ‌గా.. ప‌న్నీర్ వ‌ర్గం.. అన్నాడీఎంకే పురుట్చి త‌లైవి అమ్మ‌గా పేర్కొంది. రెండు పార్టీల‌కు మూడేసి గుర్తుల్ని కేటాయించి వాటిల్లో ఒక‌టి ఎంపిక చేసుకోవాల‌ని కోరాయి. మొద‌ట శ‌శిక‌ళ వ‌ర్గానికి ఈసీ ఆటో గుర్తును కేటాయించారు. ప‌న్నీర్ వ‌ర్గానికి రెండు క‌రెంటు స్థంభాల గుర్తుల్ని కేటాయించారు. అయితే.. త‌మ‌కు కేటాయించిన ఆటో గుర్తును కాద‌న్న చిన్న‌మ్మ వ‌ర్గం సూచ‌న‌తో తాజాగా టోపీ గుర్తును ఈసీ కేటాయిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English