బాబు కోసం గిన్నిస్ బుక్‌ ప్రయత్నాలు

బాబు కోసం గిన్నిస్ బుక్‌ ప్రయత్నాలు

గిన్నిస్ బుక్‌లోకి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ. అంత‌గొప్ప ప్ర‌త్యేక‌త‌ను రాహుల్ గాంధీ ఏం సాధించార‌ని అనుకుంటున్నారా?. రిలాక్స్ ఆయ‌నేమీ సాధించ‌లేదు. కానీ కొన్ని పోగొట్టుకున్నారు! ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో భారీ ఓట‌మిని చ‌విచూసింది.

దీంతో ఆ పార్టీ అవ‌మానాన్ని మూట‌క‌ట్టుకుంది. ఆ ప‌రాభ‌వం రాహుల్ ఖాతాలో ప‌డింది. ఒక‌టి కాదు రెండు కాదు రాహుల్ పేరుమీద కాంగ్రెస్ పార్టీ 27 సార్లు ఎన్నిక‌ల్లో ఓడిపోయింద‌ట‌. అది కాస్త గిన్నిస్ బుక్ రికార్డుకు ఎక్కే స్థాయికి చేరింది.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డించాడు. హొషంగాబాద్‌కు చెందిన విశాల్ దివాన్ గిన్నిస్ సంస్థ‌కు ఓ వెరైటీ అప్లికేష‌న్ స‌మ‌ర్పించారు. అందులో రాహుల్ గాంధీ పేరును గిన్నిస్ బుక్ ఆఫ్ వారల్డ్ రికార్డుల్లో ఎక్కించాలంటూ కోరారు. కాంగ్రెస్ పార్టీ బాధ్య‌త‌లు రాహుల్ స్వీకరించిన త‌ర్వాత ఆ పార్టీ 27 సార్లు ఓడిపోయిందట.

రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సార్లు ఓడింద‌న్న అంశంలో గిన్నిస్ బుక్‌లో చోటు క‌ల్పించాల‌ని ఆ ఇంజ‌నీరింగ్ విద్యార్థి త‌న ద‌ర‌ఖాస్తులో కోరాడు. గిన్నిస్ సంస్థ‌కు ఎన్‌రోల్‌మెంట్ రుసుము కూడా చెల్లించాడు. ఇక గిన్నిస్ సంస్థ రాహుల్ పేరును ఓ ఓట‌మి దారుడిగా త‌మ పుస్త‌కంలో ఎక్కిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు