100 కోట్లు ఖర్చు పెట్టారా తమ్ముళ్ళూ

100 కోట్లు ఖర్చు పెట్టారా తమ్ముళ్ళూ

కడప ఎమ్మెల్సీ సీటును టీడీపీ గెలుచుకోవడం పెద్ద విషయమే అయితే.. ఈ విజయంపై ఎన్నో ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. దేశంలోనే అత్యంత ఖరీదైన ఎమ్మెల్సీ ఎన్నికగా కడప ఎమ్మెల్సీ ఎన్నిక నిలిచిందని వైసిపి నాయకులు చెబుతున్నారు. ఇక్కడ గెలుపు కోసం టీడీపీ వంద కోట్లు ఖర్చు చేసిందంటున్నారు.

స్థానిక సంస్థల ఓటర్లను పాండిచ్చేరి క్యాంపు వేయించి ఒక చార్టర్‌ ప్లైట్‌ ను పూర్తిగా కడప, పాండిచ్చేరి మధ్య  షటిల్ సర్వీస్ లా తిప్పారని.. డబ్బు మంచి నీళ్లలా ఖర్చు చేశారని చెబుతున్నారు.

నెల్లూరు, కడప, కర్నూలు.. మూడు జిల్లాల్లోనూ తెలుగుదేశం పార్టీకి విజయం లభించింది. మూడు చోట్లా తగినంత బలం లేకపోయినా టీడీపీ గెలిచింది. ఈ విజయానికి అంతా.. కారణం కేవలం డబ్బేనన్న ఆరోపణలు వస్తున్నాయి జగన్ వర్గం నుండి.

ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్నవారి పంట పడింది. మరి ఈ మూడు జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది కడప జిల్లా ఎలక్షన్ నే. అక్కడ అభ్యర్థి జగన్ చిన్నాన్న కావడంతో.. కోట్ల రూపాయలను వెదజల్లిందని చెబుతున్నారు. ఓవరాల్ గా కడప ఖర్చు దాదాపు వంద కోట్ల రూపాయలని.. దేశంలో ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఎక్కడా ఇంత ఖర్చు చేయలేదని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English