జయలలిత కొడుకువా.. ఐతే జైలుకెళ్లు

జయలలిత కొడుకువా.. ఐతే జైలుకెళ్లు

ఫలానా సెలబ్రెటీ కొడుకునని.. కూతురినని కొందరు మీడియాకెక్కడం.. కోర్టుల్లో కేసులు వేయడం చూస్తుంటాం. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కొడుకునంటూ కృష్ణమూర్తి అనే ఓ వ్యక్తి తాజాగా కోర్టుకెక్కాడు. తాను జయలలిత.. శోభన్ బాబులకు పుట్టిన రహస్య పుత్రుడినని.. తనను జయలలిత వారసుడిగా ప్రకటించి.. పోయెస్ గార్డెన్ తో పాటు ఆమె ఆస్తులన్నీ తన పేరిట తర్జుమా చేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఈ కృష్ణమూర్తి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. తన తల్లి అయిన జయలలితను శశికళే హత్య చేయించిందని కూడా అతను ఆరోపించాడు. అతడికి ఓ సోషల్ యాక్టివిస్ట్ కూడా మద్దతుగా నిలిచాడు.

ఐతే ఈ కేసును విచారించిన కోర్టు కృష్ణమూర్తి పిటిషన్ ను కొట్టిపారేయడమే కాదు.. అతణ్ని తీవ్రంగా హెచ్చరించింది. నిన్ను జైలుకు పంపిస్తాం.. పోలీసులు వెంటనే అతణ్ని అదుపులోకి తీసుకోండి అని జడ్జి తీవ్ర స్వరంగా హెచ్చరించారు. తాను జయలలిత కొడుకునంటూ కృష్ణమూర్తి సమర్పించిన డాక్యుమెంట్లు.. ఇతర సాక్ష్యాధారాలన్నీ నకిలీవని కోర్టు నిర్ధారించింది.

ఇలా తప్పుడు కేసులతో కోర్టు విలువైన సమయాన్ని వృథా చేసేవాళ్లను తేలిగ్గా వదలకూడదని.. జైలుకు పంపాల్సిందే అని జడ్జి వ్యాఖ్యానించారు. తాను జయలలితతో కలిసి ఉన్న ఫొటో అంటూ కృష్ణమూర్తి సమర్పించిన ఆధారాన్ని చూసిన జడ్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్కేజీ స్టూడెంట్ దగ్గరికి తీసుకెళ్లినా ఇది నకిలీదని చెప్పేస్తారని.. నెట్లో దొరికే జయలలిత ఫొటోకు తన ఫొటో కలిపి కృష్ణమూర్తి ఫొటో షాప్ లో సృష్ణించిన ఫొటో ఇదని జడ్జి వ్యాఖ్యానించారు. అనంతరం కృష్ణమూర్తికి జరిమానాతో సరిపెట్టారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు