ఫైర్ బ్రాండ్ కు మరో ఏడాది శిక్ష

ఫైర్ బ్రాండ్ కు మరో ఏడాది శిక్ష

ఫైర్ బ్రాండ్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాకు భారీ శిక్ష వేసేందుకు రంగం సిద్ధమైంది. పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెపై విధించిన సస్పెన్షన్ వేటును మరో ఏడాది పాటు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే అనిత ఇచ్చిన సభాహక్కుల కమిటీ ఇచ్చిన నివేదికలో రోజాపై మరో ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేయలన్న డిసైడ్ చేసినట్లుగా చెబుతున్నారు. గత ఏడాది అసెంబ్లీలో రోజా అనుచితంగా వ్యవహరించారంటూ ఫిర్యాదు చేయటం.. దీనిపై విచారణ చేపట్టిన కమిటీ మూడుసార్లు రోజాను తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించారు.

అయితే.. అనారోగ్యం కారణంగా ఆమె హాజరుకాలేకపోయారు. దీంతో.. మరోసారి అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా కమిటీ ఎదుట హాజరైన రోజా..తనపై ఫిర్యాదు చేసిన వైనంపై తన వాదనను వినిపించారు. ఈ సందర్భంగా ఆమె ఎక్కడా భేషరతు క్షమాపణ చెప్పలేదని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేయాలని కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రోజాపై వేటువేసినకమిటీలో గొల్లపల్లి సూర్యారావు ఛైర్మన్ గా వ్యవహరించగా.. నందమూరి బాలకృష్ణ.. శ్రవణ్ కుమార్..జ్యోతుల నెహ్రూలు సభ్యులుగా ఉన్నారు. రోజాపై వేటు వేయాలని సిఫార్సు చేసినకమిటీ.. ఎప్పటి నుంచి ఆ పని చేయాలన్న అంశాన్ని చెప్పలేదు. ఆ నిర్ణయాన్ని శాసన సభకే వదిలేస్తున్నట్లుగా స్పష్టం చేస్తున్నారు.కమిటీ అభిప్రాయంపై విపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు.

తన పదునైన వ్యాఖ్యలతో అధికారపక్షాన్ని ఇరుకున పడేసే నేతను అడ్డుకునేందుకే ఈ తరహా ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా ఆరోపిస్తున్నారు. మరి.. ఈ తరహా విమర్శలకు సమాధానం చెబుతూ వేటు వేస్తారా? లేక..కమిటీ సిఫార్సు చేసేసింది కాబట్టి.. వేటును అమలు చేస్తారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మరోవైపు.. రోజాపై వేటు వేసిన తీరుతో.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సరికొత్త దారి చూపినట్లు అవుతుందన్న విమర్శ వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు