అనుచర నిందితులంతా క్యూలో నిల్చున్నారు

అనుచర నిందితులంతా క్యూలో నిల్చున్నారు

ఒక వ్యక్తి జైలుపాలు కావడమూ.. ఆయన గారికి ఇబ్బందులు  కలగకుండా చూసుకోవడానికి, ఆయనకు అవసరమైన సేవలన్నీ చేస్తూ తరించడానికి ఆయన గారి అనుచరులు పెట్టీ కేసులు నెత్తిన వేసుకుని తాము కూడా జైల్లోకి వెళ్లడమూ వంటి వ్యవహారాలు మనం సినిమాల్లోనే సహజంగా చూస్తుంటాం. కానీ నిజజీవితంలో కూడా సినిమా కంటె చిత్రమైన సన్నివేశాలు ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. వాటిలో ఒకటే జగన్‌ జైలు పాలైన సంఘటన కూడా! దేశంలోనే అతిపెద్దదైన ఆర్థిక కుంభకోణంగా న్యాయస్థానాలే విస్తుపోతున్న జగన్‌ అక్రమాస్తుల కేసులో.. జగన్‌ ఏ1 నిందితుడు. ఆయన సహనిందితులు ఇంకా అనేకమంది ఉన్నారు. వారిలో కొందరు కూడా జైలు పాలయ్యారు. వారిలో మధ్యలోనే బెయిలు పొందగల అర్హత, అవకాశం కొందరికి లభించింది. అయినా ఎవ్వరూ కనీసం బెయిలు గురించి అప్లయి కూడా చేయలేదు. అన్నయ్య సన్నిధిలో ఉంటే చాలు.. బెయిలుదేముంది మిధ్య అనే అనుకున్నారు.

తీరా ఇప్పుడు జగన్‌కు బెయిలు వచ్చిందో లేదో.. ఇన్నాళ్లూ జైల్లో అన్నయ్యకు సేవలు చేయడానికే తామున్నాం అన్నట్లుగా బతుకుతూ వచ్చిన అనుచర నిందితులు అందరూ వరుసపెట్టి బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారు.

ఏ1 నిందితుడు అయిన వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఈ నెల 8వ తేదీన బెయిలు కోసం దరఖాస్తు చేసుకోగా.. సోమవారం నాడు ఆయనకు బెయిలు లభించింది. ఆయన మంగళవారం విడుదల కాగా ఇదే కీసులో కీలక నిందితులుగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌, బ్రహ్మానందరెడ్డి ఇద్దరూ బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

అదే క్రమంలో బుధవారం నాడు వైఎస్‌ జగన్‌ అనుచరులు ఆయన ఆర్థిక సలహాదారు విజయసాయిరెడ్డి, అనుచరుడు సునీల్‌రెడ్డి ఇద్దరూ కూడా బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అన్నయ్య జైలునుంచి ఇంటికి వెళ్లిన తర్వాత.. ఇక తాము అక్కడ ఉండి చేసేదేమీ లేదనుకున్నారో ఏమో అందరూ వరుస పెట్టి బెయిల్‌ దరఖాస్తులు పెట్టుకున్నారు. దీంతో  బెయిల్‌కోసం అనుచర నిందితులంతా క్యూలైన్లో వేచి ఉన్నట్లు అయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు