ఈ దెబ్బ‌కు రామ‌మందిరం క‌ట్టేస్తార‌ట‌

ఈ దెబ్బ‌కు రామ‌మందిరం క‌ట్టేస్తార‌ట‌

అయోధ్య‌లోని రామమందిరం మరోమారు తెర‌మీద‌కు వ‌చ్చింది. ఎప్పుడైనా యూపీ ఎన్నిక‌ల స‌మ‌యంలో వార్త‌ల్లో నిలిచే ఈ అల‌యం ఈ సారి ఫ‌లితాల త‌ర్వాత చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తాపార్టీ ఘనవిజయం సాధించి  యూపీ పీఠం కైవసం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే బీజేపీ మిత్ర‌ప‌క్ష‌మైన శివసేన ఈ ఎపిసోడ్‌ను కొత్తగా చూస్తోంది. యూపీ ఎన్నిక‌ల్లో బీజేపీ బంప‌ర్ మెజార్టీతో గెల‌వ‌డం ప‌ట్ల శివ‌నేన‌ సంతోషం వ్యక్తంచేసింది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్ బీజేపీతో పాటు, ప్రధాని నరేంద్రమోడీకి శుభాకాంక్షలు తెలిపారు.

మిత్ర‌ప‌క్షానికి కంగ్రాట్స్ చెప్తూనే అదే సమయంలో రామమందిర నిర్మాణం గురించి సంజ‌య్ రౌత్‌ ప్రస్తావించారు. బీజేపీలో పూర్తి మెజార్టీ సాధించ‌డ‌మే కాకుండా కేంద్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉన్న నేప‌థ్యంలో  త్వరలో అయోధ్యలో రామమందిరాన్ని నిర్మిస్తారని భావిస్తున్నట్లు సంజ‌య్ రౌత్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. ఇది ప్ర‌జల ఆకాంక్ష అనే విషయం బీజేపీకి సైతం తెలుస‌ని ఆయ‌న అన్నారు. మరోవైపు పంజాబ్‌ ఎన్నికల్లో అకాలీ-భాజపా కూటమి ఓటమి చవిచూడడంపైనా ఆయన స్పందించారు. అక్కడి ప్రజలు మార్పును కోరుకున్నారని, ప్రత్యామ్నాయం లేకే కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారన్నారు.

ఇదిలా ఉండ‌గా ఇటీవల మహారాష్ట్రలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో శివసేన-బీజేపీ రెండు దశాబ్దాల తర్వాత వేర్వేరుగా పోటీచేసిన సంగతి తెలిసిందే. అందులో కీలకమైన ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో శివసేన అత్యధిక సీట్లు సాధించి మేయర్‌ అభ్యర్థిని ప్రకటించగా బీజేపీ మద్దతు తెలిపింది. త‌ద్వారా ఈ రెండు పార్టీల మ‌ధ్య గ్యాప్ ఉంద‌నే అభిప్రాయానికి చెక్ పెట్టింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు