బుకీల పంట‌పండించిన బీజేపీ, కాంగ్రెస్‌

బుకీల పంట‌పండించిన బీజేపీ, కాంగ్రెస్‌

ఐదు రాష్ర్టాల ఎన్నిక‌ల సంద‌ర్భంగా బుకీల పంట‌పండింది. యూపీలో బీజేపీ అధికారానికి దగ్గరగా వస్తుందని, పంజాబ్‌లో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని బుకీలు, బెట్టింగ్ మార్కెట్లు అంచనా వేశాయి. ఆశావ‌హులు కొందరు యూపీలో బీజేపీదే ప‌వ‌ర్ అని న‌మ్మారు. కాగా, వీరి గెస్ నిజ‌మైంది, త‌ద్వారా వారి పంట పండింది. రాజస్థాన్‌లోని చురూ, ముంబై బెట్టింగ్ మార్కెట్ల ప్రకారం యూపీలో బీజేపీ 190-201 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేశాయి.

మొదటిదశ పోలింగ్ ముగిసేనాటికి ఎస్పీ-కాంగ్రెస్ కూటమి ముందంజలో ఉన్నా, ప్రధాని మోడీ రంగంలోకి దిగడంతో ఆ తరువాతి దశల్లో బీజేపీ పుంజుకుంది. ముఖ్యంగా ఆరోదశ నుంచి బీజేపీ ఆధిక్యం కనబరిచింది. చురూ మార్కెట్ల ప్రకారం బీజేపీ 190-193 స్థానాలు, ఎస్పీ-కాంగ్రెస్ కూటమి 125-128 సీట్లు, బీఎస్పీ 65-67 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నది. ముంబై మార్కెట్లు మాత్రం బీజేపీకి 198-201 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. పంజాబ్‌లో ఆప్, కాంగ్రెస్ దాదాపు సమానంగా 53-55 సీట్లు గెలుచుకుంటాయని మార్కెట్లు అంచనా వేశాయి.

అయితే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ విజయంపై వచ్చిన‌ ఊహాగానాలపైనా పలువురు భిన్నంగా స్పందించారు. ప్రధానంగా ఇక్కడ ముఖాముఖి పోరు లేదు. ఓటింగ్ శాతం కూడా చెప్పుకోదగిన స్థాయిలో లేదు. బహుముఖ పోరులో ప్రజానాడిని గుర్తించడం అంత సులువేమీ కాదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రత్యేకించి యూపీ భారీ జనాభా, భిన్నజాతుల సమ్మేళనం. అనేక ఐరోపా దేశాల జనాభా మొత్తాన్ని కలుపుకొంటే ఉండేంత జనాభా. దీనితోపాటు యూపీలోని వివిధ ప్రాంతాలకు వాటివంటూ ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయి.

2 లక్షల మంది అభిప్రాయాలను తీసుకుని 14.05 కోట్ల మంది ఓటర్ల మనోగతాలను ప్రతిఫలించేందుకు ప్రయత్నించడం పూర్తి అశాస్త్రీయమని పలువురు నిపుణులు అన్నారు. కానీ కొన్ని స‌ర్వే సంస్థ‌లు చేసిన అంచ‌నాల‌ ఆధారంగా బుకీలు బీజేపీపై ఆస‌క్తితో బెట్ కాశారు. అయితే అనుకున్న‌ట్లుగా ఇంకా చెప్పాలంటే అంత‌కంటే ఎక్కువ‌గా ఇటు ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లో అటు పంజాబ్‌లో కాంగ్రెస్‌కు ఓట్లు రావ‌డంతో రాజస్థాన్‌లోని చురూ, ముంబై బెట్టింగ్ మార్కెట్ల పంట పండిన‌ట్ల‌యింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English