సాక్షి తీరుతో ఉరేసుకుంటానేమో: డిప్యూటీ సీఎం

సాక్షి తీరుతో ఉరేసుకుంటానేమో: డిప్యూటీ సీఎం

హెడింగ్ చూసి గంద‌ర‌గోళ ప‌డ‌కండి. అస‌లు వైసీపీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి, తెలంగాణ మాజీ ఉప ముఖ్య‌మంత్రికి  అస‌లు సంబంధం ఏంటి?  పైగా బ‌హిరంగంగా ఉరి వేసుకుంటాన‌ని ప్ర‌క‌టించే స్థాయి ప‌రిస్థితిని జ‌గ‌న్ ప‌త్రిక ఎందుకు క‌ల్పించింది? ఇవ‌న్నీ సందేహాల‌కు ఓపిక‌గా ఈ వార్త చ‌ద‌వాల్సిందే. సుదీర్ఘ కాలం త‌ర్వాత మీడియా ముందుకు వ‌చ్చిన మాజీ ఉప ముఖ్య‌మంత్రి తాటికొండ రాజ‌య్య అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా మీడియా పాయింట్ లో మాట్లాడుతూ త‌న ఆవేద‌న‌ను పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగానే బ‌హిరంగంగా ఉరి వేసుకుంటాన‌నే ప్ర‌క‌ట‌న చేశారు.

రాజ‌య్య వాద‌న‌ ప్ర‌కారం ఇటీవ‌ల సాక్షి ప‌త్రిక‌లో ఓటుకు నోటుపై క‌థ‌నం వ‌చ్చింది. దీని ప్ర‌కారం ఈ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసే క్ర‌మంలో రాజ‌య్య‌ను కూడా ట్రాప్ చేశార‌ని వార్త‌ను సాక్షి ప్ర‌చురించింది. ఈ వార్త త‌న‌ను తీవ్రంగా మ‌నో వేధ‌నకు కార‌ణం అయింద‌ని రాజ‌య్య వాపోయారు. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు, ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జగన్‌కు ఉన్న‌ గొడవల్లో నన్ను లాగొద్దని ఆయ‌న కోరారు.
తప్పుడు వార్తలు రాయించడం స‌రికాద‌న్నారు. ఓటుకు నోటు విషయంలో బాబు అడ్డంగా దొరికి పోయి..సామాన్యులను బలి చేస్తారా అని ప్ర‌శ్నించారు. ఈ వార్త చూసిన వెంట‌నే త‌న‌కు బాధతో హార్ట్ ఎటాక్ వ‌చ్చినంత ప‌ని అయింద‌న్నారు. ఒక‌ద‌శ‌లో ఆత్మహత్య చేసుకోవాల‌ని భావించిన‌ట్లు రాజ‌య్య వాపోయారు. ఒక‌వేళ ఓటుకు నోటు ఎపిసోడ్‌లో తాను డ‌బ్బులు తీసుకున్నాన‌నే వార్త‌ల్లో నిజముంటే, దాన్ని నిరూపిస్తే ఉరిశిక్షకు సిద్ద‌మ‌ని ప్ర‌క‌టించారు

కార‌ణాలు ఏవైనా త‌నను ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించిన స‌మ‌యంలోనే బంగారు తెలంగాణాలో కూలీగా ఉంటాన‌ని ప్ర‌క‌టించిన విష‌యాన్ని ఈ సంద‌ర్బంగా రాజ‌య్య గుర్తు చేశారు. తెలంగాణ ఉద్య‌మం జోరుగా సాగుతున్న స‌మ‌యంలోనే అధికార పార్టీలో ఉన్న తాను ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి మ‌రీ టీఆర్ఎస్‌లో చేరాన‌ని రాజ‌య్య వివరించారు. అప్ప‌టి ముఖ్య‌మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి త‌న‌కు డబ్బు-ప‌ద‌వులు ఆశ చూపినా.. తెలంగాణ జెండా వీడ‌లేదన్నారు. అలాంటి త‌న‌పై వస్తున్న వార్తలు రాస్తున్నారా.. రాయిస్తున్నారా అర్థం కావ‌డం లేద‌ని వాపోయారు. ఓటుకు నోటు కేసులో తాను ట్రాప్ లో పడినట్లు నిరూపిస్తే బ‌హిరంగ ఉరికి తాను సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. పిల్లిని త‌లుపులు వేసి కొట్టినా పులి అవుతుందని, అలాగే త‌న‌పై ఇలాంటి వార్త‌లు రాస్తే, రెచ్చ గొడితే చట్టపరంగా పోరాడుతాన‌ని హెచ్చ‌రించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English