మా బావ మంచోడే

మా బావ మంచోడే

టీఆర్‌ఎస్‌ నుండి బహిష్కరింపబడ్డ రఘునందన్‌రావు, టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కెసిఆర్‌పైన, కెసిఆర్‌ మేనల్లుడు హరీష్‌రావుపైన తీవ్ర విమర్శలు చేయగా, సిరిసిల్ల ఎన్నికల్లో కెసిఆర్‌ కుమారుడు కెటిఆర్‌ని హరీష్‌రావు ఓడించడానికి ప్రయత్నించారన్న విమర్శలు దుమారం రేపాయి. వీటిపై సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ మండిపడ్డారు.

తన వ్యక్తిగత అభిప్రాయాలను రఘునందన్‌ .. తనకు అంటగడుతున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. టిఆర్‌ఎస్‌లో అత్యున్నత స్థానం అనగా పార్టీ అధ్యక్ష పదవి కోసం హరీష్‌రావు ప్రయత్నించారనేది రఘునందన్‌ ఆరోపణ. పార్టీలో కెటిఆర్‌ ప్రాధాన్యత తగ్గించడానికే ఆయన్ను ఓడగొట్టడానికి హరీష్‌రావు ప్రయత్నించారని, ఇదే విషయాన్ని కెటిఆర్‌ తన వద్ద చెప్పారనీ రఘునందన్‌రావు పదే పదే చెప్పడంతో కెటిఆర్‌ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

కెటిఆర్‌కి హరీష్‌రావు బావ అవుతారు. హరీష్‌రావు, కెసిఆర్‌కి మేనల్లుడు. కేసీఆర్‌ తనయుడే ఈ కెటిఆర్‌. రఘునందన్‌ పార్టీని వీడుతూ కెసిఆర్‌ కుటుంబ సభ్యుల మధ్య పెద్ద చిచ్చు పెట్టారు. కెటిఆర్‌ని అడుడగుడునా హరీష్‌రావు అడ్డుకుంటున్నారనే ఆరోపణలు ఇంతకు ముందు కూడా వినిపించాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English