ఏడుకొండలవాడిపై మోడీ జరిమానా?

ఏడుకొండలవాడిపై మోడీ జరిమానా?

మోడీ ప్రభుత్వం తిరుమల వెంకన్నకు జరిమానా విధించనుందా... రద్దు చేసిన పెద్దనోట్లను కలిగి ఉన్న పాపానికి ఏడుకొండలవాడికి ఫైన్ వేయడానికి రెడీ అవుతుందా.. లేదంటే వెంకన్న కేసును ప్రత్యేకంగా తీసుకుని ఆయనొక్కరికే గడువు పొడిగిస్తుందా? అన్న ప్రశ్నలు తిరుమల వర్గాల నుంచి వినిపిస్తన్నాయి. దీనికి కారణం ఉంది... నవంబరు 8న మోడీ గవర్నమెంటు రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది.. అయితే.. నిర్ణీత గడువు తరువాత వాటిని కలిగి ఉన్నవారికి జరిమానా విధిస్తామని కూడా ప్రకటించింది. కానీ.. రద్దు చేసిన నోట్లను భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల హుండీల్లో వేశారు. అవన్నీ తిరుమల వెంకన్న వద్ద ఉండడంతో ఆయన జరిమానా కట్టాలా అన్న ప్రశ్న వినిపిస్తోంది.

 స్వామి వారి హుండీలో ప్రభుత్వం రద్దు చేసిన పాత 500, 1000 నోట్లు ఏకంగా రూ. 4 కోట్ల వరకు వచ్చిపడ్డాయి. గత రెండు నెలల కాలంలోనే ఈ సొమ్ము హుండీలో చేరింది. ఈ పాత నోట్లను మార్చుకోవడానికి ఇప్పటికే సమయం మించిపోయింది. ఇప్పుడు ఈ డబ్బును ఏం చేయాలో అర్థం కాక ఆలయ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ డబ్బునంతా ఏం చేయాలో సూచించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంక్ కు లేఖలు రాశారు. భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి పాత నోట్లను హుండీలో వేశారన్న సంగతిని లేఖలో పేర్కొన్నామని టీటీడీ ఈవో సాంబశివరావు చెబుతున్నారు.

రద్దు చేసిన పాత నోట్లు పది కన్నా ఎక్కువ ఉంటే రూ. 10 వేలు లేదా పాత నోట్లకు రెట్టింపు మొత్తంలో జరిమానా విధిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏడుకొండలవాడికి రూ. 8 కోట్ల ఫైన్ విధిస్తారా? లేక రూ. 4 కోట్ల పాత నోట్లు తీసుకుని, కొత్త నోట్లు ఇస్తారా? అనే విషయం తెలియాల్సి ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English