ఎన్టీఆర్ పేరు పెట్టాలన్నబాబు కల తీరినట్లే

ఎన్టీఆర్ పేరు పెట్టాలన్నబాబు కల తీరినట్లే

కొన్నిసార్లు ఎంత అనుకున్నా కుదరదు. ప్రయత్నించి.. ప్రయత్నించి ఊరకుండిపోయే పరిస్థితి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ దేశీయ టెర్మినల్ కు తెలుగోడి అన్నగారైన ఎన్టీవోడి పేరును పెట్టాలన్నడిమాండ్ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎంతగానో ప్రయత్నించారు. కానీ.. విజయం సాధించలేక పోయారు. ఆయన ఎన్నిప్రయత్నాలు చేసినా.. శంషాబాద్ దేశీయ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు ఖారారు చేయించుకోలేకపోయారు.

నాటి ఏపీ రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కి ఎన్టీవోడి పేరు పెట్టే విషయంలో సక్సెస్ కాని చంద్రబాబు.. ఈసారి మాత్రం తాను అనుకున్న రీతిలో ఏపీ కొత్త రాజధాని అమరావతికి సమీపంలోని విమానాశ్రయానికి ఎన్టీవోడి పేరు పెడుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గన్నవరం ఎయిర్ పోర్ట్ కు ఎన్టీవోడి పేరుతో పాటు.. రాష్ట్ర రాజధాని అమరావతి పేరు కలిసి వచ్చేలా.. ‘ఎన్టీఆర్ అమరావతి ఎయిర్ పోర్ట్’ అన్న పేరును డిసైడ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.  

అదే సమయంలో తిరుపతి విమానాశ్రయానికి శ్రీవెంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ గా పేరు పెట్టాలని డిసైడ్ చేశారు.తాజాగా జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో ఎయిర్ పోర్ట్ లకు ఏ పేరు పెట్టాలన్న అంశంపై చర్చ జరిగి.. చివరకూ పేర్లను డిసైడ్ చేశారు. మొత్తానికి ఉమ్మడి ఏపీ రాజధాని ఎయిర్ పోర్ట్ కి ఎన్టీవోడి పేరు పెట్టాలన్న కల.. విభజన ‘ఏపీ’ రాజధానికి పెట్టటంలో బాబు సక్సెస్ అయ్యారని చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు