శ్రీమంతుడికి ఊరట

శ్రీమంతుడికి ఊరట

ఆ మధ్యన విడుదలై ఘన విజయం సాధించిన మహేశ్ బాబు శ్రీమంతుడి సినిమా మీద నడుస్తున్న వివాదం గురించి తెలిసిందే. తాను రాసిన నవలను కాపీ కొట్టారంటూ.. సినీ నటుడు మహేశ్ బాబు.. చిత్ర దర్శకుడు కొరటాల శివలపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 2012లో స్వాతి మాసపత్రికలో తన ‘‘చచ్చేంత ప్రేమ’’ నవలను కాపీ కొట్టారని.. దాని కథ ఆధారంగానే సినిమాను నిర్మించారని..కాపీరైట్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ రచయిత విల్సన్ అలియాస్ శరత్ చంద్ర నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.

ఈ ఫిర్యాదును పరిశీలించిన నాంపల్లి మొదటి అదనపు ఎంఎస్ జే న్యాయస్థానం.. హీరో మహేశ్ బాబుకు.. దర్శకుడు కొరటాల శివ తదితరులకు సమన్నలు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై వారు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ ఉదంతంపై విచారణ జరిపిన హైకోర్టు.. నాంపల్లి కోర్టు జారీ చేసిన సమన్లపై స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తంగా శ్రీమంతుడికి కాస్తంత ఊరట లభించిందని చెప్పాలి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు