ఆ రెండూ వద్దు, మూడే కావాలి

ఆ రెండూ వద్దు, మూడే కావాలి

కాంగ్రెసు, బిజెపి పార్టీలు రెండూ వద్దని అన్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుగారు. దేశంలో తృతీయ కూటమి ఏర్పాటు కాబోతున్నదని, ఆ ప్రయత్నాలలో ఉన్నామని చెప్పారాయన.

ఇదివరకు ఓ సారి తృతీయ కూటమి కేంద్రంలో ఏర్పాటయినప్పటికీ, దాంట్లో చంద్రబాబు కీలకంగా పనిచేసినప్పటికీ అది అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఏ పార్టీకి ఆ పార్టీ విడివిడిగా వెళ్ళిపోయి తృతీయ కూటమిని నట్టేట్లో ముంచేయడం జరిగింది. చంద్రబాబు, ఇప్పుడు ఏ ఉద్దేశ్యంతో తృతీయ కూటమి అంటున్నారోగాని దానిపై కేంద్రంలో ఏ పార్టీకీ ఆసక్తి ఉన్నట్లుగా కనిపించడంలేదు.

ములాయంసింగ్‌ యాదవ్‌, జయలలిత, మాయావతి, మమతా బెనర్జీ లాంటివారు తృతీయ కూటమి గురించిన ఆలోచన చేస్తున్నప్పటికినీ, ఒకరితో ఇంకొకరు కలవడానికి ఇష్టపడని పరిస్థితి ఉన్నది. 'మూడు' వస్తే చంద్రబాబుకి వచ్చే లాభమేంటో.. ఆయనెందుకు 'మూడు' కావాలి అంటున్నారో కదూ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English