టీడీపీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు వీరే

టీడీపీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు వీరే

ఆంధ్రప్రదేశ్‌లోని అధికార తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల అభ్య‌ర్థుల ఉత్కంఠ కొన‌సాగుతోంది. సోమవారం నాలుగు జిల్లాల అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేశారు. పార్టీ అధినేత చంద్ర‌బాబు సొంత జిల్లా అయిన‌ చిత్తూరు కూడా ఇందులో ఉంది.  చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దొరబాబు, నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాకాటి నారాయణరెడ్డిలను ఎంపిక చేశారు. ఒక్కొక్కటిగా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను జిల్లా ఇన్‌చార్జి మంత్రులు ప్రకటిస్తున్నారు. ఇంకా ఉభయ గోదావరి జిల్లాలు, అనంత జిల్లా అభ్యర్థుల పేర్లు ప్రకటించాల్సి ఉంది.

శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థిగా శత్రుచర్ల విజయరామరాజు పేరును ఖరారు చేశారు. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశం అనంతరం శత్రుచర్ల విజయరామరాజు పేరును ప్రకటించారు. క‌ర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా శిల్పా చక్రపాణిరెడ్డి పేరును ఖరారు చేశారు. కర్నూలులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు శిల్పా చక్రపాణిరెడ్డి పేరును ప్రకటించారు.

గ‌తంలో పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయ‌కుల పేర్ల‌ను తాజాగా కొత్త విధానాన్ని అవ‌లంభించారు.   స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల ఎంపిక కోసం ఐవీఆర్‌ఎస్‌ సర్వే నిర్వహించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్‌ కౌన్సిలర్ల అభిప్రాయాల సేకరించారు.సర్వే ఫలితాల అనంతరం అభ్యర్థుల ఎంపిక ఇన్‌చార్జ్‌ మంత్రులు సొంత జిల్లాలకు వెళ్లాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అనంత‌రం జిల్లా మంత్రుల స‌మ‌క్షంలో అభ్య‌ర్థుల పేర్ల‌ను ప్ర‌క‌టించారు. కాగా, నామినేషన్లను దగ్గరుండి వేయించాలని మంత్రులను చంద్ర‌బాబు ఆదేశించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు