అమెరికాలో భార‌తీయుల అరెస్టు...

అమెరికాలో భార‌తీయుల అరెస్టు...

డొనాల్డ్ ట్రంప్ పుణ్యామా అని అమెరికాలో ప్రైవేట్ జైళ్లను తిరిగి పునరుద్ధరించనున్నారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రైవేట్ జైళ్లను నిషేధించారు. దేశ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రైవేట్ జైళ్లు అవసరమని, అందుకే వాటిని పునరుద్ధరిస్తున్నామని అమెరికా ప్రభుత్వం తెలిపింది. అమెరికాలోకి అక్రమ వలసలు పెరుగుతున్నాయని, ముఖ్యంగా మెక్సికన్లు ఎక్కువగా చొరబడుతున్నారని, ఈ నేపథ్యంలో ప్రైవేట్ జైళ్లను పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైన ఉన్నదని పేర్కొంది. మరోవైపు ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)ను త్వరలోనే భూస్థాపితం చేస్తామని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ చెప్పారు.

కాగా,  అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఐదుగురు భారతీయులను అరెస్టు చేశామని ఆ దేశ పోలీసులు తెలిపారు. వీరికి సహకరించిన ఓ కెనడా వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఈ నెల 8న వాషింగ్టన్ దగ్గర్లోని మోల్సన్ ప్రాంతంలో వీరందరిని అరెస్టు చేశామని, కెనడాకు చెందిన వ్యక్తి స్మగ్లర్ అని పేర్కొన్నారు. దీనిపై అమెరికా అధికార వర్గాలు మాట్లాడుతూ సరిహద్దు పోలీసుల పనితీరుకు ఈ సంఘటనే నిదర్శనమని తెలిపాయి. అక్రమ ప్రవేశాలను సహించేది లేదని పేర్కొన్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు