బ‌లుపు : బూట్లపై ఓంకారం.. బీర్ బాటిల్ పై వినాయకుడు

బ‌లుపు : బూట్లపై ఓంకారం.. బీర్ బాటిల్ పై వినాయకుడు

హిందూ మత విశ్వాసాలను కించపరచ‌డం విదేశీయులకు ముఖ్యంగా అమెరిక‌న్ల‌కు ఓ ఫ్యాష‌న్ అయిపోయిన‌ట్లుగా క‌నిపిస్తోంది. గతేడాది జూన్‌ లో హిందూ దేవుళ్లతో కూడిన డోర్ మేట్లను అమెజాన్ అమ్మకానికి పెట్టడంతో కలకలం రేగడం...మ‌న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్రంగా హెచ్చరించడంతో అమెజాన్‌ వెనక్కు తగ్గిన సంగ‌తి తెలిసిందే. అయితే బుద్ధి మార్చుకోని కొంద‌రు అదే కోవ‌లో బూట్ల‌పై ఓంకారాన్ని ముద్రించి అమ్మడమే కాక.. బీర్ బాటిల్ పై గణపతి బొమ్మను ముద్రించి అమ్మకాలు జరిపారు.

హైందవులు ప్రథమ పూజితుడిగా కొలిచే వినాయకుడు ఫొటోతో బీర్ సీసాలపై ముద్రించి  లాస్ట్ కోస్ట్ అనే వెబ్ సైట్‌ అమ్మ‌కాలు మొద‌లు పెట్టింది. బూట్లపై ఓం’ చిహ్నాన్ని ముద్రించి ‘యస్ విబే’ అనే వెబ్ సైట్ అమ్మ‌కాలు చేస్తోంది.

హిందూ మతాన్ని కించపరిచినందుకు అమెరికాకు చెందిన ఈ  రెండు వెబ్ సైట్లపై పోలీసులకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కమిషనర్‌ నరేశ్‌ కాడ్యాన్‌ ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభోవాలను దెబ్బతీసేలా ఉన్న ఉత్పత్తులను అమ్మకుండా చూడాలని కోరారు. తర్వాత ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. హిందూ మతాన్ని అవమానించిన రెండు వెబ్ సైట్లపై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో కోరారు. కేసులు నమోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు