తెలంగాణ ఇప్పుడు కాదంట

తెలంగాణ ఇప్పుడు కాదంట

2014 ఎన్నికల తర్వాత తెలంగాణ ఏర్పాటు తథ్యమని టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. ఈసారి కెసిఆర్‌ తెలంగాణకు డెడ్‌లైన్‌ చాలా దూరంగా పెట్టారు. అవున్లెండి, 2014 ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ కార్యాచరణ రచించుకున్న కెసిఆర్‌ ఇలాగే చెప్తారు.

ఎందుకంటే తెలంగాణ పేరుతో తెలంగాణ ప్రాంతంలో మెజార్టీ సీట్లు గెలుచుకోవద్దూ. ఆయన ఇంకా ఏమన్నారంటే, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందట. మిగిలిన పార్టీలు సీమాంధ్రలో మూడు ముక్కలాట ఆడతాయని ఆయన జోస్యం చెప్పడం జరిగింది. తెలంగాణ ఏర్పడ్డాక ఆంధ్ర జల దోపిడీని అడ్డుకుంటామని కేసీఆర్‌ అన్నారు.

తెలంగాణ రాకపోతే ఆంధ్రోళ్ళ చేతిలో ఆగమవుతామని కూడా కెసిఆర్‌ చెప్పారు. ఇస్తే గిస్తే కాంగ్రెసు పార్టీనే తెలంగాణ ఇస్తదని చెప్పి, తెలంగాణ జెఎసి చేస్తున్న ఉద్యమాన్ని కూడా చల్లార్చారు కెసిఆర్‌ అన్న ఆరోపణలున్నాయి. కాంగ్రెసుని బలోపేతం చేయాలని ఇదే కెసిఆర్‌ చెప్పారు. అది గతం. కాంగ్రెసు, బిజెపిలు కాకుండా తెలంగాణ ఎవరివల్ల సాధ్యమవుతుందో కెసిఆర్‌ చెప్పడంలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English